*ఇంద్రాణి*
*శృంగేరి సంస్థానానికి చెందిన దేవాలయాలలో ఈరోజు తల్లిని ఇంద్రాణిగా ఆరాధిస్తారు. ఇంద్రాణి అనగా ఇంద్రుడి భార్య. ఇతరులకి అసూయ కలిగే విధంగా ఆ తల్లి యొక్క సౌందర్యము ఉంటుంది. ఆ తల్లి యొక్క కనులు ఎంతో సోయగంతో ఉంటాయి. అందుకే ఆవిడ ఇంద్రాక్షి. ఈవిడ పౌలోముని యొక్క కుమార్తె. ఇంద్రాణి యొక్క పాతివ్రత్యం వల్లనే ఇంద్రునికి అంత వైభవము. ఇంద్రాణి ఎల్లవేళలా ఆ తల్లి అయిన లలితమ్మను ఆరాధన చేయడం వలెనే ఇంద్రుడికి ఇంద్రపదవి. ఆవిడకి అంత సౌందర్యము. ఇంద్రాణి, ఇంద్రుడు ఎలా అనుసరించేది అంటే మన నీడ ఏలాగున మనను వెంటాడుతుందో ఆలాగున ఇంద్రుడిని ఈవిడ అనుసరించేది. ఈవిడ ఎల్లవేళలా సింహము మరియు ఏనుగుల సముదాయములో ఉంటూ వజ్రకవచం వంటి చేతులతో భాసిల్లుతూ ఇంద్రుడితో కూడి ఉంటుంది. వీరికి జయంత, జయంతి దేవసేన మరియు చిత్రగుప్త పిల్లలు.*
*సర్వేజనా సుఖినోభవంతు*
*శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి*
*8886240088*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి