22, అక్టోబర్ 2020, గురువారం

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 34 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ’


ఇది పరమపవిత్రమైన నామము. ఇందులో ఒక చమత్కారమును జోడించారు. మహాకామేశ్వరుని ప్రేమ అన్న రత్నము అమ్మవారు పుచ్చుకుని రెండుమణులను ఆయనకు బహుకరించింది. అమ్మవారి రెండుస్తనములు రెండుమణులుగా స్వామివారికి ఇవ్వబడ్డాయి. దీనివలన మనకి తెలిసినది వాళ్ళిద్దరూ మనకు తల్లి తండ్రులు అన్న భావన. బాహ్యముగా తల్లి తన స్తనములనుండి క్షీరమును స్రవింపచేసి బిడ్డలను పోషిస్తుంది. ఈ బ్రహ్మాండములోని సమస్త జీవకోటి అమ్మవారి బిడ్డలే. ఆవిడ సూర్య చంద్రులను స్తనములుగా పెట్టుకుని సమస్త ప్రాణులను పోషిస్తున్నది. సూర్య చంద్రులు లేకపోతే మనకు ఆహారము దొరకదు. సమస్త ప్రాణికోటికి ఆహారము అమ్మవారి స్తనములలో నుంచి వస్తున్నట్టుగా భావించాలి. అమ్మా! అని ఏడిచిన పిల్లవాడి పట్ల కరుణ చూపించినట్లే, నేను ఎవరు? అసలు నా నిజస్వరూపము ఏమిటి? అని ఏడిచిన వారికి శివజ్ఞానమనే క్షీరము పడుతున్నది. మాయను తీసేసి శివుడు ఎవరో తెలిసేట్టుగా చేస్తున్నది.  

అమ్మవారి స్తనములలోనుంచి స్రవించే పాలు అంటే రెండు కోణములలో ఉంటాయి.  ఒకటి అందరము బ్రతికి ఉండటము. రెండు ఆ జ్ఞానక్షీరమును గ్రోలి శివుడు ఎవరో తెలుసుకోవడము. లోకములో ఎప్పుడైనా అమ్మ స్తనములు అంటే మాతృత్వమునకు గుర్తు. ఒక బిడ్డగా ఈవిడ వలననే బ్రతికి ఉన్నాను నా తల్లని రెండుచేతులు ఎత్తి నమస్కరించగలగాలి.  


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: