22, అక్టోబర్ 2020, గురువారం

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి*

 





శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి*


*6 రోజున అమ్మవారి అలంకారము.🌼🌿*

*🌼🌿శ్రీ లలితాత్రిపురసుందరీ దేవి.🌼🌿*

ప్రాత: స్మరామి లలితావదనారవిందం 
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్ 

ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం 
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున సరస్వతీ దేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. 

నైవేద్యం - అప్పాలు,పులిహోర,పెసరబూరెలు. 

కామెంట్‌లు లేవు: