దేముడిని ఏ భాషలో పూజించాలి.
మనలో చాలామందికి మనం (హిందువులము) దేవతార్చన కేవలం సంస్కృత మంత్రాలతోటే ఎందుకు పూజించాలి? నేను తెలుగులో పూజిస్తే దేముడు అంగీకరించడ అనే సందేహం కలిగి వున్నారు. నిజానికి ఇది ఆలోచించదగిన విషయం. ఎందుకంటె దేముడు అందరికి దేముడే మరి అటువంటప్పుడు దేముడిని సంస్కృతంలోనే ఎందుకు పూజించాలి.
ముందుగా మనం పూజ అంటే ఏమిటో తెలుసుకుందాము. మనం దేవాలయాలలో చేసే పూజా విధానాన్ని షోడశోపచార పూజ అని అంటారు. షోడశ ఉపచారాలు అంటే ఏమిటి.
మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే మనం ఎలాగైతే ఆ అతిథికి మర్యాదలు చేస్తామో ఆలా మనం దేముడిని విగ్రహ రూపంలో చూసుకొని ఒక అతిధిగా భావించి చేసే సేవలే ఈ షోడశ ఉపచారాలు.. ఉపచారము అంటే సేవ అని అర్ధం. మనం మన ఇంటికి వచ్చిన అతిధిని ఆప్యాయతతో ఆహ్వానించి వారికి కాళ్ళు కడుగుకోవటానికి నీళ్లు ఇచ్చి, తరువాత ముఖం కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చి, తరువాత త్రాగటానికి నీళ్లు ఇచ్చి, ఆ పిమ్మట స్నానం చేయటానికి ఏర్పాటు చేసి, వారిని వింజామరతో ( Fan or A.C) విసిరి,వారికి నూతన వస్త్రం సమర్పించి ఇలా ( పూర్వకాలంలో చేసేవారు అనుకోండి) అతిధిని మనం ఎలాగ మర్యాదలు చేస్తామో అలానే విగ్రహంలో వున్న భగవంతుడిని తలుచుకొని ఉపచారాలు చేస్తామన్నమాట.
షోడశ ఉపచారాలు అంటే 16 రకాల ఉపచారాలు అని అర్ధం. ఉదా : స్వాగతించటం, కూర్చోటానికి ఆసనము, పాదాలకు పాద్యం, ముఖానికి సుద్ద ఆచమనం అంటే నీళ్లు. ఇలా ఉంటాయి అన్నమాట.
విగ్రహానికి ఉపచారాలు చేస్తే మనకు ఏమిటి లాభం. ఈ ప్రశ్న ప్రతి సగటు వ్యక్తికీ కలుగుతుంది.
విగ్రహాన్ని మనం రకరకాల రంగుల పూలతో అలంకరిస్తాము, తరువాత ఆ విగ్రహాన్ని భక్తితో షోడశ ఉపచారాలు చేసి పూజిస్తాము.
పూజలో మనము ఏమ చేస్తాము ఇది చాలా ముఖ్యమైనది.
ముందుగా మనం విగ్రహం ముందర కూర్చుంటాము. మన ద్రుష్టి పూర్తిగా ఆ దేముడి విగ్రహం మీదే ఉంచుతాము. చెవులు బ్రాహ్మడు చదివే మంత్రాలను వినతాము. చేతులతో పూలు, అక్షింతలు, నీళ్లు సమర్పిస్తాము. మనస్సు ఆ పరమాత్మా మీద వుందుతాము. అప్పుడు నీ పంచేంద్రియాలు పూర్తిగా నిమగ్నమై వున్నాయి. అంటే నీకు హృదయంలో పూర్తిగా భగవంతుడే నిండి వున్నాడు.
మనస్సు కోతిలాంటిది. దానికి కొంచం సమయం ఇస్తే చాలు అది పరి పరి విధాలుగా చెలిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ మనస్సు పూర్తిగా ఒక స్థిరమైన విషయం మీద మాత్రమే కేంద్రేకరించి వున్నది. అదే దేముడి పూజ. కాబట్టి నీ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. అంతే కాకుండా నిశ్చలత్వం కలిగి ఉంటుంది. దానినే యోగం అని అంటారు. యోగం అంటే కలయిక అనగా జీవుడు ఇప్పుడు పరమాత్మతో కలిసి వున్నాడు అని అర్ధం. ఆ స్థితిలో వున్నా మనిషి కేంద్రేయ నాడీ వ్యవస్ఠ (central nervous system will be activated) ఉత్తేజితము అవుతుంది అన్నది శాస్త్ర విహితం. యెప్పుడైతే కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉత్తేజితము అవుతుందో అప్పుడు మీరు ఇచ్చే సూచనలు (suggestions ) కార్య రూపం దరిస్తాయి అంటే మీరు ఏ కోరికలు సిద్దించాలని ఆ పూజ చేస్తున్నారో ఆ కోరికలు తీరుతాయి.
భగవంతుడు అనేది ఒక భావన అటువంటప్పుడు దేముడికి ఈ భాషా వచ్చు, ఆ భాషా రాదు అనే ప్రశ్నయే ఉండదు. అయితే తెలుగులో మనం పూజించకూడదా అంటే చక్కగా పూజించ వచ్చు. కానీ మీరు చేసే క్రియలు మాత్రం ఏదా తధంగా చేయాలి. అప్పుడు తాప్పకుండా పూజ ఫలిస్తుంది.
కానీ మన మహర్షులు వారి జ్ఞాన నేత్రంతో ఈ చరా చర సృష్టికి కారణం ఎవరు ఆ కారకుడిని (కర్తను) తెలుసుకునే ప్రయత్నం చేసి మనకు ఒక విధానం ఏర్పాటు చేశారు. అది మన తెలుగు భాషా పుట్టాక ముందే జారిగింది. కాబట్టి మనం ఆ క్రమంలో వారు నిర్ధారించిన విధానాన్నే పాటించాలి. అప్పుడే మనకు వారు నిర్ధారించిన ఫలితాలు మనం పొందగలము.
నేను చిన్నప్పటినుండి సంస్కృతం నేర్చుకోలేదు. మరి యెట్లా అని సందేహం కలగ వచ్చు. ఇప్పటికి కూడా మించి పోయెంది ఏమి లేదు త్రికరణ శుద్ధిగా మన దేవతల ఆరాధనను తెలుసుకొని ఆచరించ వచ్చు తద్వారా సత్పలితాలను పొందవచ్చు.
మన పురాణ ఇతిహాసాల్లో అనాగరికులు సంసార హీనులు అడవులలో చేరించే మనుషులను కూడా పరమ శివుడి అనుగ్రహాన్ని పొందినట్లు తెలుస్తున్నది అంతే కాదు మనుషులే కాక ఇతర జంతువులూ కూడా అంటే ఏనుగు, పాము, సాలె పురుగు కూడా ఈశ్వరుని అనుగ్రహం పొందినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే దేముడికి కావలసింది భాష కాదు భక్తి అని, భక్తి కలిగిన పూజకు ఏ విధానము అవసరము లేదు కేవలము త్రికరణ శుద్ధి ఉంటే చాలు. కానీ మనం మనుష్యులం అందునా విద్యా వంతులము కాబట్టి మనం మన పూర్వ మేధావులైన మహర్షులు సూచించిన పద్దతి పాటించటమే బహుదా శ్రేయస్కరము.
మనం ఎప్పటికి తల్లి ఋణం, ఋషి ఋణం తీర్చుకోలేము.
ఓం తత్సత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి