22, అక్టోబర్ 2020, గురువారం

రేపు రా !"

 "రేపు రా !"

.................


   ధర్మరాజు ఇంద్రప్రస్తాన్ని పరి పాలిస్తున్న రోజులవి. ఒకరోజు ఒక బ్రాహ్మణుడుసహాయార్థం వచ్చాడు. 

ధర్మరాజు మరునాడురావాల్సిందిగా

అతడికిచెప్పిపంపించేసాడు.అతడు

విచారంగా వెనుతిరిగి వెళుతూ ఉండగా ద్వారం వద్ద భీముడు ఆ బ్రాహ్మణుని ఆపాడు.


    ఇక్కడకు వచ్చిన వారెవరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం భీముడెప్పుడూ చూడలేదు.


   " బ్రాహ్మణోత్తమా!  తమరు వచ్చిన పని పూర్తయినదా?" 


 " అయ్యా! లేదు.రేపురావాల్సిందిగా

 ఆజ్ఞ అయినది."


   భీమసేనుడు ఆశ్చర్య పోయాడు.


"తన అన్నయ్య ఒక మంచి పనిని మరురోజుకి వాయిదా వేసినాడు?"

కొన్నిక్షణాలుఆలోచించాడు.చకచకా

ప్రధాన ద్వారము వద్ద వ్రేలాడ

దీయబడ్డ గంట దగ్గరకు చేరుకుని పదేపదే మ్రోగించసాగాడు.భీముడు

అత్యంత బలశాలికదా గంటశబ్దము

మరీ భయంకరంగా వుండడంతో

అందరూఒక్కసారిగాఉలిక్కిపడ్డారు.


    ధర్మరాజు సభాస్థలి నుండి హడావిడిగా వచ్చాడు. అర్జునుడు తన ఆయుధాలు వదిలిపరుగెత్తుకు 

వెళ్లాడు. నకుల,సహదేవులు తాము చదువుతున్న గ్రంధాలు వదిలి ప్రధాన ద్వారం దగ్గరకు బయలు

దేరారు. ద్రౌపది వంట గది వదిలి ఆత్రుతగా భీమసేనుడున్న చోటుకు చేరుకున్నది. ధర్మరాజు గట్టిగా అన్నాడు.


   " ఇక ఆపు భీమసేనా! అందరం ఇక్కడే వున్నాం. సంగతేంటో చెప్పు"


   భీముడు అన్నకు నమస్కరించి అక్కడ మూగిన జనాలకేసి తిరిగి అన్నాడు.


   " మా అన్నయ్య సాధించిన గొప్ప విజయం గురించి మీకు చెప్ప

దలిచాను. అతడీవేళ మృత్యువును 

గెలిచాడు. మృత్యుంజయుడైనాడు"


   ధర్మరాజు ప్రశ్నార్థకంగా చూసాడు.


   " ఏమంటున్నావు భీమసేనా? నేనీ వేళ బయటకు వెళ్లనేలేదు.ఏశత్రువు

తోనూ తలపడనూలేదు. నేను విజయం సాధించడమేమిటి ? నీకు కల గాని రాలేదు కదా! 


   భీమసేనుడు గట్టిగా నవ్వాడు.


   "లేదన్నా! మీ గొప్పదనం మీకు తెలియదు. మానవునికి అలవికాని

మృత్యువును మీరు జయించారు.

ఆ బ్రాహ్మణోత్తముడు యాచనకు రాగా అతణ్ని మర్నాడుకదా రమ్మని

ఆదేశించారు? అనగా అర్థం- రేపటి

వరకుమీరు,బ్రాహ్మణోత్తములు బ్రతికి వుంటారని నిర్థారణకు వచ్చినట్లే కదా! అందుకే అన్నా! మీరు మృత్యువును జయించారని ప్రకటించాను."


   ధర్మరాజుకు విషయం అర్థమైనది.

తాను చేసిన తప్పు తెలిసినది. సిగ్గు పడుతూ ఇలా అన్నాడు.


   " నాయనా, భీమసేనా! ఇపుడు వాస్తవం నాకు ద్యోతకమైంది. మంచి పనులు వాయిదా వేయడమంత చెడ్డ పని వేరొకటి వుండదు."


    ఆ వెంటనే ధర్మరాజు బ్రాహ్మణోత్తమునికి వలసిన 

సహాయము చేసి సంతృప్తి పరిచి పంపించాడు.

కామెంట్‌లు లేవు: