Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 35 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ’
అమ్మవారి బొడ్డు దగ్గర బయలు దేరిన నూగారు, సన్నని వెంట్రుకలతో కూడిన తీగవలె పైకి పాకింది. అలా ప్రాకిన తీగకు రెండుపళ్ళు కాస్తే ఎలా ఉంటాయో అలా అమ్మవారి స్తనములు ఉన్నాయన్నారు
వశిన్యాది దేవతలు తమ ఉపాసనా బలము చేత లలితాపరాభట్టారికా స్వరూపము ఆవిర్భవించినప్పుడు బిడ్డలుగా అమ్మవారి అంగాంగములను పరమభక్తి భావనతో దర్శనము చేసి అమ్మవారి అనుగ్రహమును మనకు కృప చేసారు.
‘లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా’
‘స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా’
కొన్ని నామములకు విశేష వ్యాఖ్యానము అవసరము లేదు
మాతృచిహ్నములని గుర్తించి నమస్కారము చేయకలిగితే చాలు.
అమ్మవారిది సన్నని నడుము. వశిన్యాది దేవతలు మిగిలినవన్నీ చెపుతున్నారు కానీ నడుము గురించి చెప్పడము లేదు. ఉపాసనలో వారు అమ్మవారి వంక చూసినప్పుడు నడుము ఉన్నదా లేదా అని వారికి అనుమానము వచ్చి అమ్మవారికి నడుము ఉన్నదని చెప్పడానికి మాకు ఏమీ కనపడటము లేదన్నారు. ఉన్నదని చెప్పడానికి ఒక ఆధారము మాత్రము ఉన్నదని అన్నారు. ఆమె నాభినుంచి బయలు దేరిన నూగారు హృదయ మండలము వరకు వెళ్ళింది మధ్యలో ఏదీ లేకపోతే నూగారు తెగిపోతుంది. మధ్యలో ఏదో ఆలంబనము ఉన్నది కనక అది పైకి వెళ్ళింది బహుశా నడుము ఉన్నదని అనుకుంటున్నాము అన్నారు. సాముద్రిక శాస్త్రము ప్రకారము నడుము సన్నగా ఉన్నట్లయితే ఆమె క్లేశము లేకుండా ఎక్కువ మంది సంతానమునకు జన్మ ఇవ్వగలదని చెపుతారు. ‘ఆబ్రహ్మకీటకజనని’ ఆవిడ ఇన్ని బ్రహ్మాండములలో ఇంతమంది పిల్లలను కన్నతల్లి. ఈ నామమును జగన్మాతగా అనుసంథానము చేసి నమస్కరించాలి.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి