12, ఏప్రిల్ 2021, సోమవారం

ఉగాది

 *🍑ఉగాది పండుగను ఎందుకు, ఎలా జరుపుకుంటారు🍑*




తెలుగు సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యేది ఈ రోజే.. అందుకే సంవ‌త్స‌రంలో మొద‌టి రోజు.   యుగానికి ఆది యుగాది.. కాలక్రమేణ ఉగాదిగా మారింది. సంస్కృతం లో యుగాది అనే మాటకు కృత, త్రేత, ద్వాపర,కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. 


తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకొంటాం. హేమాద్రి, కమలాకరభట్టు వంటి పండితులు దీన్ని నిర్ధారించారు.



*🥭పురాణ కథ*


తెలుగు వారికి ఉగాది ముఖ్య‌మైన పండుగ‌. ఉగాది రోజు బ్ర‌హ్మ సృష్టిని చేశాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒక‌ప్పుడు సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి ద‌గ్గ‌రుండే పురాణాలను దొంగిలిస్తాడు. ఆ వేదాలను తీసుకుని రాక్ష‌సుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో ఆయ‌న‌ మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలు (పురాణాలు)ను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు.


దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అలా బ్ర‌హ్మ సృష్టిని చేయ‌డం ఉగాది రోజే ప్రారంభిస్తాడు. దీంతో ఆ రోజుకి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్య‌త‌ను క‌ల్పించారు. ఇక మ‌న‌కు ఒక సంవ‌త్స‌రం పూర్త‌యితే బ్ర‌హ్మ‌కు అది ఒక రోజు అవుతుంది. క‌నుక బ్ర‌హ్మ‌కు రోజూ ఉగాదే అవుతుంది. అంటే అత‌ను రోజూ సృష్టి చేస్తాడ‌న్న‌మాట‌.



*🥭ఉగాది పచ్చడి విశిష్టత*


ఈ రోజు అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి.  ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగినది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వ బోధ చేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరు స్వీకరించాలి. 


వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు సాధారణంగా వాడుతారు. మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నేయి వంటివి కూడా వాడుతారు. మొత్తం మీద షడ్రుచుల సమ్మితంగా దీన్ని తయారుచేస్తారు. దీన్ని కొత్త కుండలో/గిన్నెలో తయారు చేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను, ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు.


ఉగాది ప‌చ్చ‌డి మ‌హా ఔష‌ధ‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఉగాది నుంచి త‌రువాత వ‌చ్చే శ్రీ‌రామ న‌వ‌మి వ‌ర‌కు లేదా చైత్ర పౌర్ణ‌మి వ‌ర‌కు ప్ర‌తి రోజూ తినాల‌ట‌. మొత్తం 15 రోజుల పాటు ఉగాది ప‌చ్చ‌డిని తినాలని దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఆయా వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని చెబుతారు.

ఉగాది ప‌చ్చ‌డి ఆరు రుచుల స‌మ్మేళ‌న‌మ‌ని  మ‌న‌కు తెలుసు. అందులో వేసే వేప పువ్వు, ఆకు క‌డుపులో ఉండే నులి పురుగులు, క్రిముల‌ను చంపేస్తాయి. గాలి సోక‌డం, ఆట‌ల‌మ్మ‌, అమ్మోరు వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే పచ్చి మామిడి కాయ‌ యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. దీంతో జ్వ‌రాలు రావు. వాత‌, పిత్త, క‌ఫాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. దీని వ‌ల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.



*🥭ఇక ఉగాది పండుగ‌కు చెందిన మ‌రిన్ని విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.*


* పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణోక్తి. 


* ఉగాది పండుగ వ‌సంత రుతువులో వ‌స్తుంది. సాధార‌ణంగా ఈ కాలంలో ఆట‌ల‌మ్మ‌, ఇత‌ర విష జ్వ‌రాలు ఎక్కువ‌గా వ‌స్తాయి. దీంతో పాటు ప‌లు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం  కూడా ఉంది. అందుకు ఉగాది ప‌చ్చ‌డి చాలా మేలు చేస్తుంది.


* ఉగాది రోజున ఇంటి ద్వారాల‌కు మామిడి ఆకుల‌తో, బంతి పూల‌తో తోర‌ణాలు క‌డుతాం. ఈ క్ర‌మంలో బంతిపూలు, మామిడి ఆకుల‌లో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ బ‌యోటిక్ గుణాలు వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బ‌య‌టి నుంచి రోగ కార‌క క్రిముల‌ను ఇంటి లోప‌లికి రాకుండా చూస్తాయి.


* సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు.



*🥭ఈ రోజు చేయాల్సిన ప్రత్యేక స్నానం*


నీటిలో గంగాదేవి, తైల (నూనె) లో ల‌క్ష్మీదేవి ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి.  ఉగాది రోజున ఉద‌యాన్నే నువ్వుల తైలాన్ని శ‌రీరానికి ప‌ట్టించి నాలుగు పిండితో  అభ్యంగ‌న స్నానం చేయాలి. ఇలా చేసిన‌ వారికి అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయని, వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. క‌నుక ఈ  రోజున ఇలా స్నానం చేయ‌డం మాత్రం మ‌రువ‌కండి.

🙏🏻

🍑🏵️🍑🏵️🍑🏵️🍑

🏵️🍑🏵️🍑🏵️🍑🏵️




*_🥭ఉగాది🥭_* 


_ఉగాది - భావం_


_హైందవశాస్త్రం ప్రకారం అరవై తెలుగు నామసంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక క్రమంగా వస్తాయి._

_బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడు. ఆ రోజు యుగమునకు ఆది - యుగాది, నేటి ఉగాది. భారతీయ గణితవేత్త శ్రీ భాస్కరాచార్యులవారి గణనం ప్రకారం ఈ రోజున సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చని పంటపొలాలు, ఏపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి. ఇది తెలుగు వారి కొత్త సంవత్సరాది._



_*🥭ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:*_


_ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక_


_బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం_

_ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం_

_వేప పువ్వు – చేదు -బాధకలిగించే_ _అనుభవాలు_

_చింతపండు - పులుపు_ _- నేర్పుగా_ _వ్యవహరించవలసిన పరిస్థితులు_

_పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు_

_మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు_ _చేసే పరిస్థితులు_

_ప్రొద్దునే ఇంటి_ _ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు._



_*🥭పండగ తయారి:*_


_ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి._ _ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రీ కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు._ _పచ్చటి మామిడి తోరనాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కధ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి._ _సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కధ._

_ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు._ _శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు._

_ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం._


*_పంచాంగ శ్రవణం:_*


_ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు._ _పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది._


*_కవి సమ్మేళనం:_*


_ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం"_ _నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం._

_ఊరగాయల కాలం:_

_మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు._ _వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి,_ _ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా_ _వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”_


🙏

కామెంట్‌లు లేవు: