12, ఏప్రిల్ 2021, సోమవారం

బ్రహ్మాస్త్రం

 బ్రహ్మాస్త్రం వక పరిశీలన. 

ఎందుకు వీటి శక్తిని గురించి తెలిసుకొనే ప్రయత్నం లేదు. ఙ్ఞానం మరుగున పడటమేనా? అనంతమైన శక్తి కేంద్రగా గల భారతీయ మేధాశక్తి వెలుగులోకి తీసుకొనే ప్రయత్నం చేయాలి. విశిష్టమైన జీవుల సృష్టి కర్తయైన పరమేశ్వర తత్వం తిరిగి పునరుత్పతి చేయుటయే ఙ్ఞానమని అది జీవమనుగడుకు మాత్రమే అనగా ధర్మ స్థాపనకేయని అనగా సృష్టి వక సూత్ర పరంగా పకృతి ప్రకారం నడచుటకే భారతీయ శాస్త్రీయ విఙ్ఞానము తప్ప జీవ వి నాశనమునకు కాదని తెలియవలెను. దీని మూల సూత్రము గాయత్రీ మంత్ర శక్తి. అనగా సృష్టికి మూల శక్తి గాయత్రీ శక్తియని అదియే బ్రహ్మాస్త్రం. దీని ప్రయెూగము మనం వివిధ సందర్భలలో ప్రయెూగ పరిశీలనచేసిన రావణుడు వక అల్ప కారణము నకు ఆంజనేయస్వామివారి పై, అశ్వథ్థామ పరిీక్షత్తు పై యిలా ప్రయెూగార్హతలేని సందర్భాలే. అహంకార పూరిత ప్రవర్తనతో గూడిన ప్రయెూగమని తెలియవలెను. దీనిని సృష్టి లయ పునరుత్పత్తికే ప్రయెూగించవలె గాని, 

అదియును ధర్మగ్లాని సమయమున మాత్రమే. అదియును జీవ వినాశనం లేక కొన్ని జీవ కణములను ధాతు పరంగా రక్షణ చేసి యీ శక్తి ప్రయెూగం నకు అతీతమైన లక్షణములు గల జీవులుగా అనగా విశిష్టమైన వ్యక్తులద్వారా జీవ రక్షణ సందర్భంగా మాత్రమే.లయ కార సమయములో మాత్రమే. దీని ప్రయెూగం పరీక్షత్పై అశ్వథ్థామ బ్రహ్మాస్త్ర ప్రయెూగమునుండి  రక్షణ చేయుటకు శ్రీకృష్ణుడే సూక్మ రూపంలో గర్భ ప్రవేశం చేసి శిశువును ఆవరించిన శక్తిని గదా ప్రహరణయనే శక్తితో రక్షించి కాపాడుట.యిచ్చట గదా ప్రహరణ అనే సూత్రమును పరిశీలన చేసిన (ప్రలంబ ముష్ఠింకచైవ) యనే సూత్రమే. దీని విశ్లేషణలో ప్ర లంబ ముష్ఠికంచ ఏవ యని గాయత్రీ ఛందస్సులో గల శక్తి సృష్టికి మూల సూత్ర వివరణకు దగ్గరగా యున్నదని తెలియుచున్నది. ప్రయెగించినవాడు అశ్వథ్థామ ప్ర

యెూగించుటకు కారణము సృష్టి ధర్మమును నాశనం చేయుటకు. పరీక్షిత్తు లేనియెడల విఙ్ఞానము తెలియక ధర్మసూక్మములు తెలియక యితిహాస వేద లక్షణములు తెలియక అధర్మం  బాగా ప్రబలి సృష్టి వినాశనము నకు దారితీయును. రావణ ప్రయెూగం కూడా హనుమంతుని శక్తిని నిర్వీర్యం చేయుటకే. విశ్వామిత్ర పాత్ర కూడా అహంకారంతో త్రిశంకుని రూపముగా  ప్రకృతి 🌿🍃విరుద్దంగా ప్రయెూగమే. బ్రహ్మాస్త్రం సృష్టిని వక క్రమ పథ్దతిలో రక్షణ చేయుటకే గాని వినాశనమునకు కాదని తెలియవలెను. పై వుదాహరణలద్వారా శక్తి ప్రయెూగము జీవ మనుగడకే గాని వినాశనమునకు కాదని తెలియనగును. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం మని పైవిషయములద్వారీద్వారా తెలియును. దీనిని శక్తి వృత్తాకారమువలె భూమిని భూమిపై నున్న జీవులను రక్షణ చేయును. యిది హవిస్సు రూపంలో వ్యాప్తి చెంది యుండును. ప్రయోగం వలననే శక్తి లక్షణం తెలియును.అనంతమైన ఙ్ఞానము సాధన ద్వారానే తెలియును. దీనికి ఎన్నో దృష్ఠాంతములు.తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: