8, అక్టోబర్ 2022, శనివారం

 [07/10, 9:58 pm] +91 79892 77128: कारणपरचिद्रूपा काञ्चीपुरसीम्नि कामपीठगता ।

काचन विहरति करुणा काश्मीरस्तबककोमलाङ्गलता ॥ १॥


कञ्चन काञ्चीनिलयं करधृतकोदण्डबाणसृणिपाशम् ।

कठिनस्तनभरनम्रं कैवल्यानन्दकन्दमवलम्बे ॥ २॥


ऐश्वर्यमिन्दुमौलेरैकात्म्यप्रकृति काञ्चिमध्यगतम् ।

ऐन्दवकिशोरशेखरमैदम्पर्यं चकास्ति निगमानाम् ॥ ३॥ 


लीये पुरहरजाये माये तव तरुणपल्लवच्छाये ।

चरणे चन्द्राभरणे काञ्चीशरणे नतार्तिसंहरणे ॥ ४॥


कामपरिपन्थिकामिनि कामेश्वरि कामपीठमध्यगते ।

कामदुघा भव कमले कामकले कामकोटि कामाक्षि ॥ ५॥ 


समरविजयकोटी साधकानन्दधाटी

    मृदुगुणपरिपेटी मुख्यकादम्बवाटी ।

मुनिनुतपरिपाटी मोहिताजाण्डकोटी

    परमशिववधूटी पातु मां कामकोटी ॥ ६॥


जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते ।

जय जय महेशदयिते जय जय चिद्गगनकौमुदीधारे ॥ ७॥ 


#Kamakoti #Kamakshi

[07/10, 9:58 pm] +91 79892 77128: ధర్మాకృతి : మహేంద్రమంగళంలో శాస్త్రాభ్యాసం - 3


17వ శతాబ్దంలో కంచిపీఠం 62వ పీఠాధిపతుల కాలంలో మహ్మదీయ దండయాత్రల భయంతో కంచినుంచి బయలుదేరింది కదా! కంచి పీఠానికి అనూచానంగా భక్తులైన ఉడయార్పాళెం జమీందారులు శ్రీచరణులను వారి ఊరిలో వచ్చి ఉండమని ప్రార్థించారు. తగిన బందోబస్తు చేశారు. 


మళ్ళీ తంజావూరు మహారాజు ప్రార్థనపై తంజావూరు తరలెంత వరకూ శ్రీమఠం ఉడయార్ పాళెంలో ఉంది. అప్పటి శ్రీమఠపు దినసరి ఖర్చులు జమీందారు తన అధీనంలో ఉన్న బృహదీశ్వరాలయ మిగులు నిధులతో భరించారట. అందువల్ల స్వామి ఈ పీఠం, ఈ పీఠభక్తులు బృహదీశ్వరునికి ఋణపడి ఉన్నారంటున్నారు. అంతేకాదు తమ పూర్వ పీఠాధీశ్వరులు చేసిన ఖర్చులు అన్నీ పరిశీలిస్తున్నప్పుడు ప్రతి కార్తీక పౌర్ణమికి గంగైకొండ చోళపుర బృహదీశ్వరునికి అన్నాభిషేకానికి రెండు బస్తాల బియ్యం వాడుకగా ఇవ్వడం, అన్నాభిషేకానికి కావలసిన ఏర్పాట్లలో సహాయ సంపత్తులను అందజేయడానికి స్వామివారు గమనించారు. 


కొంతకాలంగా అయిపోయిన అన్నాభిషేకాన్ని పునరుద్దరించవలసినదిగా తన శిష్యులను ఆజ్ఞాపిస్తున్నారు. అది శిష్యులు తన వంటి బీద సయాసికి అంటుకొన్న ఋణవిముక్తికి చేయవలసిన బాధ్యతగా చెబుతున్నారు. ఆ గుడిపై స్వామికి అంతటి అనుబంధం. ఇంతకీ ఆ గుడిలో శివలింగానికి అన్నాభిషేకం అంత సులభ సాధ్యమైన విషయం కాదు.


తంజావూరు బృహదీశ్వర లింగం కంటే పెద్ద లింగం. రాజరాజ చోళుని పుత్రుడు రాజేంద్రచోళుడు. ఆయన గంగాతీరం వరకు దండయాత్ర చేసి ఆ ఉత్తర దేశపు రాజుల తలలపై గంగ మోయించి ఇక్కడ స్వామికి అభిషేకం చేశారట. ఆయన కాలంలో అన్నాభిషేకం విస్తారంగా జరిగేదట. దగ్గిర దగ్గిర 80 బస్తాలు వండి వార్చి పొద్దున్న నుండి సాయంకాలం లోపల ఆ అన్నంతో ఈ మహాలింగానికి అభిషేకం చెయ్యాలి. అప్పుడు ఒక్కొక్క అన్నం మెతుకు ఒక్కొక్క శివలింగంతో సమానం. 


అన్నప్రసాదం పావువంతు జలచరములకు కావేరిలో కలపాలి. మరొక పావు వంతు ఆవులకు ఆహారంగా ఇవ్వాలి. మిగిలిన సగం 14 గ్రామాలలోని ప్రజలు పంచుకొంటారు. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం. స్వామివారు మళ్ళీ ఈ మహాలింగమునకు రాజేంద్ర చోళుని కాలంలో చప్పబడిన విధంగా నిరంతర గంగా జలాభిషేకం, అయిదు మానికల అన్నం, తదితర సంభారాలతో నైవేద్యం, అన్నాభిషేకం ఇవ్వన్నీ ఏర్పాటు చేయించారు. 1989లో కేవలం కొద్ది పర్యాటకులు మాత్రమే దర్శిస్తూ వచ్చిన ఈ దేవాలయం ఈ రోజున కళకళలాడుతోంది. మళ్ళీ 80ఏళ్ళ పూర్వానికి వెళదాం.


శ్రీ మహాస్వామివారికి హైందవ సంస్కృతీ సంప్రదాయముల మీద మిక్కుటమయిన అభిమానం ఉంది. ఆయన ఒక మత ఆచార్యులు. మతాతీతమయిన ఆధ్యాత్మిక గురువులు. ఈ దేశాన్ని ఈ దేశ సంస్కృతిని ఎంతగానో అభిమానించే దేశభక్తులాయన. 1914 ప్రాంతాలలో వారు చూపిన చొరవ, పరిశీలన ఈ లక్షణములను ప్రోది చేసింది. శ్రీ శివానందమూర్తిగారన్నట్లు హిందూమతాన్ని సంస్కృతిని సమగ్రంగా అర్థం చేసుకొని ఆచరించి ఉపదేశించిన అతి కొద్దిమంది మహాత్ములలో వారొకరు.


1915లో స్వామివారు మేజర్ అయినారు. అంతవరకూ మఠనిర్వహణ కోర్ట్ ఆఫ్ వార్ట్స్ చే నియమించబడిన మేనేజర్ చేత నిర్వహించబడినది. 1915 శంకర జయంతి రోజున స్వామివారు పీఠబాధ్యతలను స్వయంగా చేపట్టారు. కామకోటి పీఠములో దినసరి కార్యక్రమములన్నీ స్వామివారిచే నియమించబడిన శ్రీకార్యం ఏజెంట్ చేత నిర్వహించబడతాయి. అన్ని వ్యవహారాలూ శ్రీవారి అనుమతితో ఈ ఏజెంట్ చేస్తారు. స్వామివారు సన్యాసులయినందువల్ల చేవ్రాలు చేయరు. అన్ని ముఖ్య పత్రముల మీద శ్రీకార్యం ఏజెంటు స్వామి సన్నిధిలో స్వామివారి ముద్రవేసి సంతకం చేస్తారు. ఆ సంవత్సరపు శంకర జయంతి ఉత్సవము అత్యద్భుతంగా నిర్వహించబడింది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: