8, అక్టోబర్ 2022, శనివారం

ఏకాగ్రత్త అంటే

 *ఒక చిన్న పిల్లాడు తన అనుమానాన్ని తల్లితండ్రుల దగ్గర ధ్యానం అంటే ఏమిటని ఒక ప్రశ్న అడిగాడు.*

వారు వారికి తెలిసిన అన్ని విధాల వివరించినా ఆ పిల్లాడికి అర్థం కాలేదు.వారు ఆ అబ్బాయిని రమణమహర్షి దగ్గరకు తీసుకు వెళ్ళారు


ఆ అబ్బాయి మహర్షిని చూసి 

అయ్యా ధ్యానం అంటే ఏంటి అని అడిగాడు.

ఆయన నవ్వుతూ ఆ పిల్లాడి ముందు అరిటాకు పరిచి అందులో ఒక దోశ వేశారు.


నేను *మ్* అని ఎప్పుడు అంటానో అప్పుడు తినడానికి మొదలు పెట్టాలి.

రెండవసారి మ్ అని అన్నప్పుడు నీ ఆకులో ఏమీ ఉండకూడదు అన్నారు.


ఆ పిల్లాడు మహర్షి ఎప్పుడు *మ్* అని అంటారా అని వేచిచూసాడు.


కాసేపు తరువాత రమణ మహర్షి మ్ అని అన్నారు. ఆ పిల్లాడు తినడం మొదలుపెట్టాడు.

ఎక్కడ వెంటనే *మ్* అని మళ్ళీ అనేస్తారేమో అని త్వరత్వరగా తినడం మొదలు పెట్టాడు.


దోశ అయిపోతున్నది కానీ మహర్షి *మ్* అని అనలేదు.

ఆ పిల్లాడు మహర్షిని దోశ ను మార్చి మార్చి చూస్తున్నాడు.

చివరగా *మ్* అని అనగానే ఆకులోని చివరి ముక్కను ఆ పిల్లాడు తినేసాడు.


ఇప్పుడు మహర్షి పిలిచి 

నేను మొదటి సారి *మ్* అన్నప్పటి నుండి రెండవసారి *మ్* అనేవరకు నువ్వు ఉన్నావే అదే ధ్యానం అంటే అని వివరించారు.


ఏకాగ్రత్త అంటే అది.... 

ఎక్కడ వినిపించకుండా పోతుందో అని ధ్యాస మొత్తం ఆ శబ్దం పైన ఉంచడం.

ఆ ఏకాగ్రత్త నీ ప్రతి పనిలోనూ ఉంటే నీలో లోపం ఉండదు అని వివరించారు.


మొదటి *మ్* జననం అయితే 

రెండవ *మ్* మరణం 

వాటి మధ్యలో ఉన్నదే జీవితం అన్నారు ఆయన.


ఎన్నో అనుమానాలకు ఒక్క చర్యతో అర్థమయ్యేలా వివరించారు. 🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: