26, అక్టోబర్ 2023, గురువారం

ఊర్ధ్వపుండ్రధారణ

 *ఊర్ధ్వ పుండ్ర విధి** 

ఉర్ద్వపుండ్రం ద్విజానాం అగ్నిహోత్ర సమోవిధిః !

శ్రాద్ధకాలే చ సంప్రాప్తే కర్తా భోక్తా చ న త్యజేత్!!


స్మృతిచంద్రికాయాం

సంధ్యాకాలే చ హోమే చ స్వాధ్యాయే పితృతర్పణే! 

శ్రాద్దం దాని చ యజ్జే చ ధారయే దూర్ఘ్వపుండ్రకమ్!!


కశ్యపః

ఊర్ధ్వపుండ్రం తు విప్రాణాం సంధ్యానుష్ఠాన కర్మసు | 

శ్రాద్ధకాలే విశేషేణ కర్త భోక్త చ న త్యజేత్ ||


గౌతమస్మృతా 

సంధ్యాకాలే జపే హోమే స్వాధ్యాయే పితృతర్పణే!

 శ్రాద్ధదానే చ యథేచ ధారయే దూర్ధ్వపుండ్రకమ్ ||


జాబాలి స్మృతా

ఊర్ధ్వపుండ్రం తు విప్రాణాం సంధ్యానుష్ఠాన కర్మవత్ | 

పైతృకే చ విశేషేణ కర్తా భోక్తా చ న త్యజేత్ ||

వ్యాస

లలాటే హ్యూర్ధ్వపుండ్రం తు ధృత్వా కుర్యు ర్విజాతయః !

తర్పణం చాపి వై శ్రాద్ధం అన్యథా నిష్ఫలం భవేత్!!


 భరద్వాజః 

ప్రాణాయామే నమస్కారే స్నాన హోమార్చనే జపే | 

పైతృకే ప్రేతకృత్యేపి ఊర్ధ్వపుండ్రం విధీయతే || 


స్కాందపురాణే

వనమాలాం చోర్ధ్వపుండ్రం ధారయేత్ పితృ తృప్తి!

త్యజే త్రిపుండ్రకం త్రాద్ధే కర్తా భోక్తా తథైవ చ!!

శౌనకో౭పి

రుద్రాక్షధారిణం విప్రం తథా లింగార్చితం నరమ్ | ఫాలే త్రిపుండ్రకం దృష్ట్వా నిరాశా పితరో గతాః 

తథా చ స్మృతిచంద్రికాయాం


పైతృకేషు చ సర్వత్ర ఊర్ధ్వపుండ్రం చ ధారయేత్ | త్రిపుండ్రధారిణం దృష్ట్యా నిరాశా పితరో గతాః ||


ద్విజులకు ఊర్ధ్వపుండ్ర (ధారణము అగ్నిహోత్రం తో సమానమైన విధి. శ్రాద్ధ కాలము సంప్రాప్తించినపుడు కర్తయు భోక్తయు (ఊర్ధ్వపుండ్రమును ధరించక) త్యజించకూడదు. 


స్మృతిచంద్రికలో : సంధ్యావందనము, హోమం, స్వాధ్యాయము, పితృతర్పణము, శ్రాద్ధము, దానము (అన్ని కాలములందు - అన్ని కర్మలందు)లలో ఊర్వపుండ్రమును ధరించవలెను.కశ్యపుడు : విప్రులకు ఊర్ధ్వపుండ్ర ధారణము సంధ్యానుష్ఠాన కర్మలందు ఆవశ్యకము. శ్రాద్ధకాలమందైతే కర్త, భోక్త విశేషించి ధరించవలెనేగాని త్యజించారు. 


గౌతమనుస్మృతిలో : సంధ్యావందనము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము, శ్రాద్ధము, దానము, యజ్ఞము ఈ కాలములలో ఊర్ధ్వపుండ్రము ధరించవలెను.


జాబాలి స్మృతిలో : 

బ్రాహ్మణుడు ఊర్ధ్వ పుండ్రాలు సంధ్యానుష్ఠానకర్మవలె విహితము, పితృకర్మలందు విశేషించి కర్త భోక్త విడువక ధరించవలెను. ఇట్టి స్థితిలో ఊర్ధ్వపుండ్రధారణ విడువదగదు. వ్యాసుడు : ద్విజులు తర్పణముగాని, శ్రాద్ధమునుగాని, నొసట ఊర్ధ్వపుండ్రము ధరించియే చేయవలెను. లేనిచో ఆ కర్మ నిష్ఫలము.


భరద్వాజుడు : 

ప్రాణాయామము, నమస్కారము, స్నానము, హోమము, అర్చనము, జపము, పితృకర్మల కాలమందు ప్రేతకార్యమందుకూడ కర్తకు ఊర్ద్వపుండ్రాలు విధించబడింది .

*స్కాంద పురాణంలో :* పితృదేవతల తృప్తి కొరకు వనమాలను (విష్ణువు కల్పించిన శేషపవిత్రము, జపమాల) ఊర్ధ్వపుండ్రమును కర్త ధరించవలెను. శ్రాద్ధమందు కర్త, భోక్త త్రిపుండ్రము ధరించరాదు.


రుద్రాక్ష ధరించిన విప్రుడిని - లింగార్చన చేసిన వ్యక్తి, నుదుట త్రిపుండ్రము కలవానిని, చూచి పితరులు నిరాశతో తిరిగి పోదురు


*స్మృతి చంద్రిక* లో : అన్ని పితృకార్యములందు ఊర్ధ్వపుండ్రమును ధరించవలెను.

కామెంట్‌లు లేవు: