26, అక్టోబర్ 2023, గురువారం

ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.

 అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు.


"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని కృష్ణుడు అంటాడు. 


ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు. అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు.


కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.


అలా వెళ్ళిపోవడమే ఉత్తమం.

కామెంట్‌లు లేవు: