26, అక్టోబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



అటుపైని దక్షుడు పరమదక్షుడై అరవైమంది ఆడ పిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిణీదేవి తవ

స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది. అందరూ పెరిగి పెద్దవారయ్యారు. వీరిలో పదమూడు మందివి

కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. పదిమందిని ధర్ముడికీ, ఇరవైయేడుమందిని చంద్రుడికీ, ఇద్దరిని

భృగువుకీ, నలుగురిని అరిష్టనేమికీ, ఇద్దరిని అంగిరసుడికి ఇచ్చి వేదోక్తంగా పరిణయోత్సవాలు జరిపించాడు.

కొన్నాళ్ళు గడిచాక యుక్తవయస్కలైన చివరి ఇద్దరు కూతుళ్ళనీ అంగిరసుడికే ఇచ్చి పాణిగ్రహణం

జరిపించాడు. వీళ్ళంతా పుత్రపౌత్రవతులు అయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులూ పరస్పర

విరోధులూ దేవదానవులు. రాగద్వేషాలకు పెట్టింది పేరులై మోహావృతులై నిరంతరం కలహించుకున్న

సోదరులు వీరు.

జనమేజయా! నువ్వు అడిగిన సూర్యచంద్రవంశాల చరిత్ర ఇకనుంచి ప్రారంభమవుతుంది.

శ్రద్ధగా విను. వినడానికి ఇంపుగా ఉంటుంది. ధర్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో

అందుతాయి. తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారదమహర్షి అనుగ్రహించి చెప్పగా.

విన్న పావనచరిత్ర ఇది.

* సూర్యవంశ చరిత్ర

దేవతలూ దానవులూ ఆవిర్భవించారు అన్నానుకదా! ఆ దేవతలలో సుప్రసిద్ధుడు సూర్యుడు.

అతడికే వివస్వంతుడనీ పేరు. అతని కుమారుడు వైవస్వతమనువు. ఇతని కొడుకు ఇక్ష్వాకుడు.

సూర్యవంశ వివర్ధునుడు ఇతడే. ఇక్ష్వాకుడి తరువాత వైవస్వతమనువుకి మరి తొమ్మిదిమంది పుత్రులు

ఆవిర్భవించారు. నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, నృగుడు, దిష్టుడు, కరూషుడు,

వృషధ్రుడు అని వారి పేర్లు.

పెద్దకొడుకైన ఇక్ష్వాకుడికి నూరుమంది పుత్రులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు వికుక్షి. మిగతా

తొమ్మండుగురు ఇక్ష్వాకు సోదరులను గురించి సంగ్రహంగా చెబుతాను. నాభాగుడికి అంబరీషుడు

జన్మించాడు. ఇతడు ధర్మజ్ఞుడు. సత్యసంధుడు. మహావీరుడు. ప్రజాపాలన తత్పరుడు. ధృష్టుడి కొడుకు

ధార్ఘకుడు. ఇతడిలో క్షాత్రధర్మంకన్నా బ్రాహ్మణధర్మం ఎక్కువ. యుద్ధాలంటేనే భయం. నిరంతరం

తపస్సు చేసుకునేవాడు. శర్యాతి కొడుకు ఆనర్తుడు. సుకన్య అనే కూతురుకూడా జన్మించింది.

రూపలావణ్యవతి. చ్యవనుడనే రాజుకి అంధుడైనా ఈ సుందరిని ఇచ్చి వివాహం చేశాడు శర్యాతి.

మకవ్యాచ్యవనులకు గుణశీల సంపన్నుడైన కొడుకు పుట్టాడు. అతని పేరు సులోచనుడు. సూర్యపుత్రులైన

అశ్వినులతో అన్నింటా సాటివచ్చేవాడని విన్నాను.

వ్యాసమహర్షీ! ఇక్కడ నాదొక సందేహం. సుకన్య చాలా అందగత్తె అంటున్నావు. అలాంటి

ముందరీమణిని ఒక అంధుడికి ఇచ్చి వివాహం చెయ్యడమేమిటి పాపం? రూపం లేకపోతేనో గుణం

మంచిది కాకపోతేవో ఏదో చేశారంటే అర్థం ఉంది. అసలు ఈ వివాహానికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది?

అంటూ జనమేజయుడు అడ్డుతగిలాడు.

కామెంట్‌లు లేవు: