అత్ర్యాది సప్త ఋషయః సమపాస్య సంఘాః అని వేంకటేశ్వర సుప్రభాతం రూపంలో వేద వచనం. అత్రి మెు దలగు సప్త ఋషులు 7 కొండలుగా వెలసి మౌనంగా తపస్సు చేసే కొండలు. ఋషులు కొండలుగా వెలసిరి. అనగా ఋషి అనగా అనంతమైన శక్తిని సూత్రపాయ్రంగా దర్శించుట. అనంతకోటి బ్రహ్మాండమైన శక్తి గల వేంకటాచలమును ఉపాసన ద్వారా మాత్రమే తెలియగలము. అటువంటి శక్తిని దర్శించుట యే జీవ లక్షణము. అనగా బ్రహ్మ మే బ్రహ్మ మునుండి విడిచి బ్రహ్మమును చూచు చున్నది. కాని భౌతికంగా చూచుటకు ప్రయత్నం. అది సూత్రప్రాయంగా మాత్రమే శక్తి చూడవలెను గాని భౌతికంగా చూచుటకు వీలులేదు. అందుకే అన్నమయ్య అన్నట్లుగా వేదములే శిలలై వెలసినదియని ఆచార్యులవారి సప్తఋషి మండలము నుండి సప్తగిరులపైనున్న శక్తి కూడా వకటే అచ్చటనుండే శక్తి ప్రసారణ వివరణ.ఋషులు తపస్సు చేయుదురే గాని భోగములు అనుభవించరు.భోగి యెూగి కాడు. యత్ ఏదైతే జీవ లక్షణము గ అంతటా వ్యాపించియున్నదో కలదో దాని లక్షణమును లేదా దాని గమనమును దర్శించు వాడు యెూగి అనే అర్ధం. అంతేగాని యీ భోగము ఆ భోగము అనే మాయమాటలు అనగా మాయలో పడవేయుట కాదు. పర తత్వమును దర్శించుటయే ఆత్మ తత్వం. అదే సప్తగిరుల లక్షణము వాటి మూలశక్తియైన వేంకటాచల తత్వం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి