60,65 సంవత్సరాలు దాటిన ఆడ,మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు .
*************************
1) మీరు బాత్రూంలో వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు.మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.
2) తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.
3) ఫ్యాన్ లు,ఫోటోలు తుడచడానికి గానీ , రిపేరు చేయటానికి గానీ , గుడ్డలు ఆరవేయటానికి గానీ స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .
4) కారు గానీ , స్కూటర్ గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి.
5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం.
6)మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ,ఆనందపరిచే విషయాలలో గానీ ,
మనశ్శాంతిగా వుండే విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు.
7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను)తీసుకవెళ్ళండి.
వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.
8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి. వీలైనంత త్వరగా మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి.
9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర ,రెండోది మీ భార్య దగ్గర.
10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి.ఎప్పుడైనా అవసరం రావచ్చు.
11) ఇంట్లో వారితోను , బయటి వారితోను
మాట్లాడేటప్పుడు మర్యాదగా , మృదువుగా మాట్లాడండి . కోపంగాను , రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.
12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ , జరిగేదాని గురించి గానీ, జరుగబోయేదాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.
13) ఈ వయసులో మనశ్శాంతి,మంచి ఆరోగ్యం,మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం.
Note = మీరు వీలు చేసుకుని + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి