*14- శ్రీ ఆదిశంకరాచార్య విరచితము అపరోక్షానుభూతి*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*శ్లో|| ఏవందేహ ద్వయాదన్య ఆత్మపూరుష ఈశ్వరః |*
*సర్వాత్మాసర్వ రూపశ్చ సర్వాతీతో೭ హోమవ్యయః ||*
*తాత్పర్య వివరణం:-*
*సూల సూక్ష్మ దేహములకంటే అతీతుడను. దేహములకు ప్రేరకుడను, జీవుడనుకాదు. ఈశ్వరస్వరూపుడను, సర్వమునకు అత్మస్వరూపుడను, నాయందే అంతయు కల్పితమైనది గనుక సర్వము నాస్వరూపమే నేను సర్వాతీతుడను అనగా ఈదృశ్య స్వరూపం నాదికాదు. దృశ్యము కంటే నేను వేరు. అధిష్ఠానము కంటే ఆరోపము ఇది వేరు కాదు గనుక నాకంటే ఇది వేరుకాదు. స్వప్రకాశ స్వరూపడను, సాక్షిని అని గ్రహించ వలయును.*
*శ్లో|| ఇత్యాత్మ దేహభాగేన ప్రపంచసైయ వసత్యతా|*
*యథోక్తాతర్కశాస్త్రేణ తతః కింపురుషార్థతా||*
*తాత్పర్య వివరణం:-*
*ఇంతవరకు మూల శ్లోకములను బట్టి ఆత్మ శరీరము కంటే ప్రపంచంకంటే వేరని తేలినది. రెండూ వేరయినప్పుడు ఆత్మవలె ప్రపంచం కూడా సత్యమని చెప్పినట్లయినది. తర్కశాస్త్రము చెప్పినట్లే చెప్పబడినది. దీనివలన మోక్షపురుషార్థ మెట్లు సిద్దించును? అని ప్రశ్నయే ఈ శ్లోకమున కర్థము.*
*శ్లో|| ఇత్యాత్మ దేహభేదేన దేహాత్మత్వం నివారితం|ఇదానీందేహ భేదస్య హ్యసత్వం స్ఫుటముచ్వ తే||*
*తాత్పర్య వివరణం:-*
*ఇంతవరకు దేహదులకంటే ఆత్మవేరని చెప్పడమైనది. అనగా ముందు అనాత్మవస్తు కంటే ఆత్మవేరుగా నున్నదని, పరిశోధన చేయవలెను. తరువాత ఆత్మకంటే అనాత్మ వేరులేదని విచారించవలయును. ఇదియే బ్రహ్మవిచారమునకు లక్షణము. ఇక ఆత్మకంటే దేహము మొదలగు దృశ్యం వేరులేదని చెప్పుచున్నారు.*
*శ్లో|| చైతన్య సై#్యకరూపత్వాద్భేదోయుక్తో నకర్హిచిత్ | జీవత్వం చమృషాజ్ఞేయం రజ్ఞౌ సర్పగ్రహోయథా||*
*తాత్పర్య వివరణం:-*
*ఘటము ప్రకాశించుచున్నది అనగా తెలియుచున్నది. పటముతెలియుచున్నది, అని అనుగతమైన అనుభవమునుబట్టి చైతన్యరూపమైన ఆత్మ ఏకరూపమేగాని, నానా రూపమైనది కాదు. చైతన్యరూపులైన జీవులు నానావిధముగా నున్నారు కదా. అంటే తాడుయందు పాము అను భ్రమవలే, పరమాత్మయందు జీవత్వభ్రమ కలిగినది. భ్రమవలన ఏర్పడిన జీవనానాత్వము వల్ల పారమార్థికమగు పరమాత్మ ఏకత్వమునకు విరోధము లేదు. మనముఖం ఒకటి అయినను నూరు అద్దములలో నూరుముఖములు కనిపించును, గాని అద్దములనే ఉపాధుల వలననే నానాత్వము యేర్పడినది. దానివలన ముఖం ఒకటి యనుటలో విరోధంలేదు. ఘటాకాశము మఠాకాశము అని అనేక ఉపాధులలో ఆకాశము ఉపాధి భేధముచేత అనేక ఆకాశములగా కనిపించినను, పరమార్థముగా ఆకాశం ఒకటేగాని నానాకాదు. అటులనే అజ్ఞానకల్పితమైన అంతఃకరణ లనేకములు గనుక ఆయంతఃకరణలయందు పరమాత్మ ప్రతిబింబములే ఆజీవులుగను,ఆజీవులు చాలా మందియున్నను. బింబమైన పరమాత్మ ఒకటియేగాని నానాకాదని అద్వితీయమని ప్రతిబింబ రూపులయిన జీవులందరు బింబమైన పరమాత్మకంటే వేరుకాదు. గనుక ఏకత్వమునకు భంగములేదని గ్రహించవలసిన విషయం.*
🕉🌞🌏🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి