5, సెప్టెంబర్ 2024, గురువారం

ప్రపంచ పేపర్ బోయ్స్ దినోత్సవం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 04.09.2024,బుధవారం



*నగరం నిద్రపోతున్న వేళ... తొలి కోడి కూతకు ముందే అతడు మేల్కొంటాడు.* రవి కిరణాలు ప్రసరించక మునుపే.. ఎముకలు కొరికే చలిలోనూ *ప్రపంచాన్ని గుప్పిట పట్టి* ఆ సంగతులన్నింటినీ ఇంటింటికీ చేరవేస్తాడు. *తానెవరో కూడా కన్పించక... ఇలా వచ్చి, అలా వెళ్లిపోతాడు. పేరుకు మాత్రమే అతడు పేపర్ బాయ్...* కానీ, అతడో సామాజిక సారథి.. *వార్తా పత్రికలను పాఠకులకు చేర్చే నిత్య నూతన వారధి. అతనికి ఒక రోజు* 


*💐ఈరోజు ప్రపంచ పేపర్ బోయ్స్ దినోత్సవం💐*


మొట్టమొదటి పేపర్ బాయ్ అమెరికాకు చెందిన *బార్నీ ఫ్లాహెర్టీ.* ఆ రోజుల్లో పేపర్ వెయ్యాలంటే అక్కడి ప్రజలు నామోషీగా భావించేవారు. *బార్నీ మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నట్టు తన పరిస్థితికి తగ్గట్టు తాను పేపర్ బాయ్‌గా చేస్తే తనకు ఖర్చులకు డబ్బులు వస్తాయని అనుకున్నాడు.* అనుకున్నదే తడవుగా పేపర్ బాయ్ గా చేరిపోయాడు. . *1833 నాటికి అతడి వయస్సు 10 సంవత్సరాలు. ఆయన అప్పట్లో న్యూయార్క్ సన్ పేపర్ వేసేవాడు.* తెల్లవారకముందే దిన పత్రిక ఇంటికి చేరవేస్తుండడంతో ఇతర పేపర్ల వినియోగదారులు సైతం బార్నీ వేసే న్యూయార్క్ సన్ పేపర్‌నే కోరుకున్నారు.


దీంతో అనతికాలంలోనే ఆ పత్రిక చందాదారులు రెట్టింపయ్యారు. బార్నీ అనంతరం మరికొందరు పేపర్ బాయ్‌గా చేరినా వారందరికీ అతడే ఆదర్శంగా నిలిచారు. బార్నీ సేవలు గుర్తించిన పత్రికా యాజమాన్యం అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించింది. *పేపర్ బాయ్‌గా చాలా మంది పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు (సెప్టెంబర్ 4)ను ఆయా పత్రికా సంఘాల నాయకులు పేపర్ బాయ్స్ డే గా ప్రకటించారు.* నాటి నుంచి *ప్రపంచంలోని అన్ని పత్రికల యాజమాన్యాలు బార్నీ పుట్టిన రోజున పేపర్ బాయ్స్‌డేగా ఫాలో అవుతున్నాయి.* ఇదిలా ఉండగా *అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్ ప్రెస్ అసోస్సియేషన్ 125 వార్సికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం అతడి కాంస్య విగ్రహాన్ని 2005లో ఏర్పాటు చేసింది.*


*ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు.*


*అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు. ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.*

కామెంట్‌లు లేవు: