5, సెప్టెంబర్ 2024, గురువారం

వినాయక చవితి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

               *వస్తున్న*

*వినాయక చవితి సందర్భంగా*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

        *వినాయక వ్రత కల్ప*

      *పద్యములు/ శ్లోకములు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।*

*ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే॥*


*అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్।*

*అనేక దం తం భక్తానాం ఏకదం తముపాస్మహే।*


*గణానాం త్వా గణపతిం హవామహే।*

*కవిం కవీనా ముపమశ్రవస్తమమ్।*

*జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత ఆనం*

*శృణ్వన్నూతిభి స్సీద సాధనమ్ మహాగణాధిపతయే నమః।*


*భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్।*

*విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥*


*ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం।*

*పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ॥*


*ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం।*

*భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥*


*ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం।*

*చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥*


*సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః।*

*లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః।*

*ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః।*

*వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః।*

*షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి।*


*నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,*

*ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్।*


*వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ*

*నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.॥*


*తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌।*

*మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.।*

*కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై*

*యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.॥*


*తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్।*

*ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత*

*నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ*

*తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయకా!*


*తలచెదనే గణనాథుని*

*తలచెదనే విఘ్నపతిని తలచినపనిగా*

తలచెద నే హేరంబుని*

*దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌॥*


*అటుకులు కొబ్బరి పలుకులు*

*చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌।*

*నిటలాక్షు నగ్రసుతునకు*

*బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.॥*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: