జై శ్రీ రామ్
*గురువు...*
*ఓ అద్భుతమైన వెలుగు*
➖➖➖✍️
ఒకప్పుడు గురువు దగ్గర
మొట్టికాయలు తిన్నాను...
కనుకనే మనో నేత్రం
తెరుచుకుంది!!...
బుద్ధి, జ్ఞానం విచ్చుకుంది!!...
బట్టీ పట్టిన పాఠాలు
బతుకుకు దారిచూపాయి!!...
మెదడుకు పదును పెట్టిన పాఠాలన్నీ
పటిష్ఠతకు ప్రాణం పోశాయి...
విశిష్టమైన దారిలోకి నెట్టాయి!!...
విశిష్ఠ అవతారాన్ని ఇచ్చాయి...
అందుకే సాహిత్య సముద్రంలో
నిరంతరం ఈదుతూనే ఉన్నాను!!...
తెలియకుండానే ఈదడం వచ్చేసింది!!.
సరిహద్దులు లేని సముద్రాన్ని...
హద్దులను అందుకొని...
తీరానికి చేరే మార్గాలను వెతుకుతున్నా!!...
అలనాడు గురువు నేర్పిన
అక్షరాల సందాయమే...
ఈనాడు కలిసొచ్చిన అదృష్టంగా...
నడిచొచ్చిన సాహిత్యంగా...
కవితావేశం నాలో పొంగుతోంది!!...
అందమైన వాక్యాలు
నాచుట్టూ అల్లుకున్నాయి!!...
నాలో మెదిలిన అద్బుతమే...
అక్షరాలలో ఇమిడిన భావం!!...
దాని అంతరాత్మను తెలుసుకోవడం
అందిన ప్రతి వస్తువును
అందుకోవడం జరిగింది!!...
గురువు ఓ అద్బుత సృష్టి...!
ఆయన చూపులు ఓ పరిపుష్టి..!!
ఆయన చేసిన ఉపదేశమే...
నా ఆలోచనల ప్రవాహానికి పుష్టి..!!!
ఈ అక్షర సంపద ఆయన పెట్టిన భిక్ష!!..
పిచ్చిగీతలు గీసినప్పుడు...
అక్షరాలు పలకనప్పుడు...
తగిన పదాలు రాయనప్పుడు...
ఆప్యాయత.., ప్రేమ స్పర్శతో...
అనురాగ హృదయ స్పందనతో...
అక్షరాకృతిని తొడిగించి...
భావామృతాన్ని తాగించారు !!
నన్ను శాసించి ఆశయం వైపు...
కలగన్న స్వప్నం వైపు...
నడిపించిన మహోన్నత వ్యక్తి!..!
మానవతామూర్తి!!...
గొప్పవ్యక్తిత్వం కలిగిన గురువర్యులు...!!
వారికివే నా శిరస్సు వంచి...
చేస్తున్న ప్రణామములు!!🙏
జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ
ఆత్మీయ ఉపాధ్యాయులందరికి
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి