5, సెప్టెంబర్ 2024, గురువారం

ప్రపంచసృష్టికి

 👆శ్లోకం 

ఉద్భవ క్షోభణో దేవః.                        

శ్రీగర్భః పరమేశ్వరః|.                         

కరణం కారణం కర్తా                         

వికర్తా గహనో గుహః||.                     


ప్రతిపదార్థ:


ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.


క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.


దేవ: - క్రీడించువాడు.


శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.


పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.


కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.


కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.


కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.


వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.


గహన: - గ్రహించ శక్యముగానివాడు.


గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.

కామెంట్‌లు లేవు: