13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

*శ్రీ కృష్ణ మందిరం

 🕉 *మన గుడి : నెం 438*







⚜ *కర్నాటక  : ఉడిపి* 


⚜ *శ్రీ కృష్ణ మందిరం*



💠 ఉడిపి  పుణ్యక్షేత్రం అనేక దేవాలయాలతో, ప్రతినిత్యం లక్షలాది ముముక్షులఃవులైన యాత్రికులతో, నిత్య నూతనోత్సవాలతో కళకళలాడుతూంటుంది. 

ఇచ్చటి వాతావరణం ఎప్పుడూ అనుక్షణం ప్రవర్థమానమైన దివ్య చైతన్యంతో స్పందిస్తూ ఉంటుంది. 


💠'ఉడుప' 

 (చంద్రుడు) అనే పదాన్ని అనుసరించి ‘ఉడిపి' అనే పేరు ఏర్పడింది. 

ఉడిపిని దక్షిణ భారతదేశంలోని 'మధుర (శ్రీకృష్ణ భగవానుడి జన్మస్థలం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది) అని పిలుస్తారు. 


💠 13వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్వాచార్యులు శ్రీశంకరుల అద్వైతమతాన్ని, శ్రీ రామానుజుల విశిష్టాద్వైత మతాన్ని పూర్తిగా ఖండించి కొత్తగా ద్వైత మతాన్ని (మధ్య మతం) ప్రతిపాదించిన అవతారమూర్తి - వాయుదేవుడు, హనుమంతుడు, భీమసేనుల అవతారం అని ప్రతీతి. 


💠 భారతదేశమంతా తన ద్వైతమతాన్ని ప్రచారంచేసి అనేక అద్వైత పండితులను ఓడించి తన శిష్యులుగా తీసుకున్నారు. 

వీరు ప్రతిపాదించిన వైష్ణవం 'సర్వైష్ణవం' శ్రీరామానుజుల శ్రీవైష్ణవంకంటే భిన్నమైనది.


💠 భక్తితో శ్రీకృష్ణపరమాత్ముని సేవిస్తూ నీతి నియమాలతో పవిత్రంగా జీవించడమే భక్తులకు అతి సులభమైన తరుణోపాయం అని సులభంగా బోధించారు. 

వీరికి గల అపూర్వమైన దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఆ ఓడలో నావికుడు ఒక గోపీ చందనం మూటను కానుకగా సమర్పించాడు. 

ఆ మూటలో గోపీచందనం కణికల మధ్య వీరికొక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. 


💠 ఈ చిన్న కృష్ణ విగ్రహాన్ని శ్రీ మధ్వాచార్యులవారు సుమారు 800 సం.లకు పూర్వం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్టాపించారు. అంత్యకులజుడైన కనకదాసు ఈ కృష్ణ దర్శనం చేసుకుని తరించాలని ప్రాధేయపడగా, పూజారులు నిరాకరించినప్పుడు, కనకదాసుకి సాక్షాత్ ప్రత్యక్ష దర్శనమిచ్చిన శ్రీకృష్ణ విగ్రహమే ఈ విగ్రహం.


💠 పరమ భక్తుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై దివ్యదర్శనాన్ని సాక్షాత్కరించాడు. 

ఆనాడు కనకదాసుకు గవాక్షం గుండా దర్శన మిచ్చిన కిటికీలో నుంచే భక్తులు ఈనాటికి కృష్ణ దర్శనం చేసుకుంటారు. 

కృష్ణుని ప్రార్థించిన చోట ఒక దివ్య మంటపాన్ని నిర్మించారు. ఇదే కనకదాసు మంటపం.


💠 శ్రీమధ్వాచార్యులకి వీరికి పద్మనాభ తీర్థులు,ద్వైతసిద్ధాంత నరహరి తీర్థులు, మాధవ తీర్థులు, అక్షోభ్య తీర్థులు అను నలుగురు ముఖ్య శిష్యులు.


💠 శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించిన ఉడిపి క్షేత్రాన్ని తన కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా చేసుకుని శ్రీ మధ్వాచార్యులు ఎనిమిది మంది శిష్యులను ఎన్నుకుని వారికి దీక్షనిచ్చి పలుమూర మఠం (శ్రీ హృషీకేళ తీర్థులు), అదమారు మఠం, (శ్రీ నరసింహ తీర్థులు) కృష్ణాపుర మఠం (శ్రీ జనార్ధన తీర్థులు) పుత్తిగెయ మఠం, (శ్రీ వామనతీర్థులు) 

సోదెయ మఠం, (శ్రీ రామతీర్థులు), 

పేజావర మఠం (శ్రీ అధోక్షజతీర్థులు) అనే ఎనిమిది మఠాలను ఏర్పరిచారు.


💠 ఈ మఠాధిపతులే ఒక్కొక్కరు, రెండేసి సంవత్సరాలకొక పర్యాయం ఒకరివంతు చొప్పున కృష్ణదేవాలయంలో పూజాది కార్యక్రమాలు, నిత్య అర్చనలు జరపాలని ఏర్పాటు చేసారు. వీరిని కన్నడలో 'అష్ట మాతగలు' అని పిలుస్తారు .

ప్రతి అష్ట మఠానికి దాని స్వంత దేవత ఉంటుంది, దీనిని పట్టాడ దేవరు అని పిలుస్తారు.


💠 ప్రతీ రెండేసి సంవత్సరాలకు ఒకసారి ఇచ్చట జరిగే పర్యాయ మహోత్సవానికి కోటానుకోట్లు యాత్రికులు సందర్శిస్తారు. ప్రాచీన భారతీయ సంస్కృతి కన్నులకు కట్టికట్లుగా ఉంటుంది. 

కన్నడ జానపద నృత్య నాటక సంబంధమైన యక్షగానాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. యాత్రికులు దివ్యచైతన్యంతో ఆనందానుభూతిని పొందుతారు.


💠 ఇతర అష్ట మూఠాలలోని అన్ని ఇతర విగ్రహాలు కూడా పడమర ముఖంగా ఉంటాయి.  

భక్తులు ఎల్లప్పుడూ లోపలి కిటికీ ద్వారా కృష్ణుని దర్శనం చేసుకుంటారు, దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు మరియు కనకనా కిండి అని పిలువబడే బయటి కిటికీ, ఇది కనకదాసు పేరుతో ఒక తోరణంతో అలంకరించబడి ఉంటుంది. ఇదే విధమైన కిటికీ విగ్రహం ముందు భాగంలో ఉంటుంది మరియు దీనిని నవగ్రహ కిండి అంటారు.


💠 ఆలయం ఉదయం 5:30 గంటలకు  తెరవబడుతుంది. ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దేవతను తొమ్మిది రంధ్రాలతో (నవగ్రహ కిండి) వెండి పూతతో కూడిన కిటికీ ద్వారా పూజిస్తారు.

ఈ ఆలయం మధ్యాహ్న సమయంలో కూడా ప్రసాదాన్ని అందజేస్తుంది మరియు అధిక సంఖ్యలో భక్తులకు ఆహారం అందజేస్తుంది కాబట్టి దీనిని అన్న బ్రహ్మ అని పిలుస్తారు .


💠 ఉడిపి కృష్ణ మఠానికి అయ్యే ఖర్చులను భక్తుల స్వచ్ఛంద విరాళాలు మరియు కృష్ణ మఠాన్ని నిర్వహించే అష్ట మఠాలు భరిస్తాయి.


🔅 *పండుగలు*


💠 మకర సంక్రాంతి , రథ సప్తమి , మధ్వ నవమి , హనుమాన్ జయంతి , శ్రీ కృష్ణ జన్మాష్టమి , నవరాతి మహోత్సవాలు , మాధ్వ జయంతి , విజయ దశమి , నరక చతుర్దశి , దీపావళి , మరియు గీతా జయంతి వంటి పండుగలను ప్రతి సంవత్సరం పర్యాయ మఠం జరుపుకుంటుంది. 


💠 ఎలా చేరుకోవాలి:

 ఉడిపి బెంగళూరు నుండి 400 కి.మీ. మంగళూరు సమీప విమానాశ్రయం (60 కి.మీ.)

కామెంట్‌లు లేవు: