*బొట్టు(కుంకుమ,తిలకం) ఏ వేలితో పెట్టుకోవాలి అంటే*
🌸☘️🌸☘️🌸☘️🌸☘️
చేతికున్న ఐదు వేళ్ళల్లో అలవాటు ప్రకారం ఏ వేలితో నైనా పెట్టుకోవచ్చు..
అనామికా శాంతి డా స్యాత్
మధ్య మాయుష్కరీ భవేత్ |
అంగుష్ఠ: పుష్టిదః ప్రోక్తః
తర్జనీ మోక్షదాయినీ ||
అని స్కాందపురాణం చెబుతోంది..
ఉంగరం వేలుతో తిలకం పెట్టుకుంటే, శాంతి కలుగుతుంది.
మధ్యవేలితో తిలకం దిద్దుకుంటే ఆయుష్షు పెరుగుతుంది .
బొటనవేలితో బొట్టు పెట్టుకుంటే, ఆరోగ్యం సిద్ధిస్తుంది .
ఇక, చూపుడు వేలితో బొట్టు పెట్టు కుంటే మోక్షం సిద్ధిస్తుంది .
అందుకే, ఇతరులకి చూపుడు వేలితో బొట్టు పెట్టొద్దు .అని చెబుతారు .
ఇక చిటికెన వేలితో తిలకధారణ చేయకూడదా ! అంటారేమో,ఆ పరమేశ్వరుడి తిలకాన్ని దిద్దెప్పుడు చిటికెన వేలితోనే దిద్దుతారు . ‘కనిష్ఠికాభ్యాం గంధం పరికల్పయామి’ అని కదా ఆ స్వామికి గంధాన్ని అలంకరిస్తాము .
అందువల్ల , ఏ వేలితో తిలకమ్ దిద్దుకోవాలి ? అనే ప్రశ్నేమీ అవసరం లేదు .తిలకమ్ దిద్దుకోవడం మాత్రం ప్రధానం .
శ్రీ మాత్రే నమః..🙏🕉️🙏.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి