13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

నిజాలు

 కొన్ని పచ్చి నిజాలు:


యవ్వనంలో ఉన్నప్పుడు *"మొటిమల్ని"* గురించి బాధపడే వాళ్ళం! 


ముసలితనం వచ్చినప్పుడు *"ముడతల్ని"* గురించి బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"ఆమె"* చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి *"చేయి"* పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను *"ఒంటరిగా"* వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు అందరూ *"ఒంటరిగా"* వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే *"చికాకు"* పడేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం *"మాట్లాడటం"* లేదే అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"అందాన్ని"* ఆస్వాదించే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ *"అందాన్ని"* చూసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నాకు *"చావు"* లేదు అనుకుంటాం!


ముసలితనం వచ్చినప్పుడు .... *"రోజులు దగ్గర పడ్డాయి"* అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో *"ప్రతి క్షణాన్ని"* పండగ చేసుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఆ *"తీపి జ్ఞాపకాల్ని"* నెమరు వేసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"నిద్రలేవడం"* కష్టంగా ఉండేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు *"నిద్రపోవడానికి"* కష్టపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా *"గుండెల మీద"* పిడిగుద్దులతో గుద్దుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఈ *"గుండె ఎప్పుడు ఆగి పోతుందో"* అని భయపడుతుంటాం!!


కనుక........


జీవితంలో రకరకాల *"ఆటు పోట్లు"* వస్తుంటాయి. 

దేనికీ భయపడ కూడదు. 


ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి.

 అదే నిజమైన *"జీవితానుభవం".* 


అది *"యవ్వనంలో"* నైనా.. *"ముసలితనంలో"* నైనా.....ఉన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా *"ప్రశాంతంగా"* ఉంటుంది.


అందుకే.......


 *యవ్వనంలో..... విర్రవీగకు!*

*వృద్దాప్యంలో..... బాధ పడకు!!*

కామెంట్‌లు లేవు: