13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠానికి

 శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠానికి, కాశ్మీర్‌లోని సర్వజ్ఞ పీఠం మధ్య విశిష్టమైన, గాఢమైన అనుబంధం పూర్వకాలంనుంచి ఉంది. కాశ్మీర్, మహర్షి కశ్యపుని తపస్సు ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. మహర్షి కశ్యప కుమారుడు మహర్షి విభాండకుడు, అతని మనవడు మహర్షి ఋష్యశృంగుడు తామిద్దరూ తపస్సు చేసిన ప్రదేశంగా శృంగేరి ముఖ్యమైనది. ఈ ప్రప్రథమ శక్తిపీఠం శ్రీ కాశ్మీరేతు సరస్వతీ మన దేశ సమైక్య ఆరాధనాదేవతగా అనాదిగా పూజింపబడింది. శ్రీ శంకరులు మొట్టమొదటగా పూజ చేసిందీ అక్కడే.


శృంగేరి మఠం, సేవ్ శారద కమిటీ సహకారంతో, ఇటీవల కాశ్మీర్‌లోని టీట్‌వాల్‌లో చారిత్రాత్మక కుంభాభిషేక వార్షిక వేడుక (వార్షికా అభిషేక)ను నిర్వహించింది.

(లైబ్రరీ వీడియో)

కామెంట్‌లు లేవు: