3, అక్టోబర్ 2023, మంగళవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 42*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 42*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *గతైర్మాణిక్యత్వం గగనమణిభి స్సాన్ద్రఘటితం*

          *కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యః |*

          *స నీడేయచ్ఛాయాచ్ఛురణ శబలం చన్ద్రశకలం*

          *ధను శ్శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ‖*


దేవతల శరీరములు మాంసమయములు కావు. మంత్రమయములు, మంత్రస్వరూపములు. అందువలన వారి అవయవ వర్ణన లౌకిక దృష్టితో చూడరాదు. ఈ శ్లోకం నుండి చెప్పబడిన అమ్మవారి రూప వర్ణన మంత్ర చైతన్యము. 

ఈ వర్ణన సాధకుడిని జీవభావం నుండి దైవభావంలోకి అక్కడ నుండి క్రమంగా పరమాత్మ భావనలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది.

 నిజానికి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క దేవతా రూపము. 


ఇప్పుడు చిదగ్నికుండం నుండి ఉద్భవించిన అమ్మవారి వర్ణన శిరస్సుతో ప్రారంభిస్తున్నారు.


గతైర్మాణిక్యత్వం గగనమణిభి స్సాన్ద్రఘటితం = అమ్మవారి కిరీటం గగన మణిభిః  

ఆకాశపు మణులతో అంటే ద్వాదశాదిత్యులను మణులుగా పొదిగి స్సాన్ద్రఘటితం

 చిక్కగా ఎడము లేకుండా పొదిగారట ఆ స్వర్ణ కిరీటంలో. *కురువింద మణి శ్రేణీ కనత్కోటీరమండితా* అని అమ్మవారి నామం.  


స నీడేయచ్ఛాయాచ్ఛురణ = ఒక గూడు వలె వచ్చిన కిరీటం పైన


చంద్రశకలం = చంద్రవంక 


శ్శౌనాసీరం ధనుః = ఇంద్రధనుస్సు వలె కనబడుతున్నదట ఆ చంద్రవంక. 

ఎందువలన? 

చంద్రుడు హిమరూపుడు తేమ కలిగినవాడు. ఆ కిరీటపు మణుల కాంతి ఈ నెలవంకలో ప్రసరించి ఆ విధంగా సప్తవర్ణశోభితంగా కనబడుతున్నదట. 

*సహస్రదళ పద్మస్ధా సర్వవర్ణోపశోభితా*.


కిమితి న నిబధ్నాతి ధిషణామ్ = బుద్ధిమంతులైన కవులు ఈ దృశ్యమును అవలోకించి చంద్రకళను ఇంద్రధనుస్సుగా తమ కావ్యములలో ఎందుకు నిబద్ధించరు? తప్పకుండా అలా వర్ణిస్తారు అని భావం.   


ఈ శ్లోకంలో చెప్పబడ్డ మంత్రం *శ్రీ హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః*


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: