*1939*
*కం*
మమతలు కొనలేని ధనము
మమతలు తెంచంగ తరము మహిలో నెపుడున్.
సుమతుల సైతంబు ధనము
కుమతులుగా మార్చగలుగు కుటిలము సుజనా.
*భావం*:-- ఓ సుజనా!భూలోకంలో ఎల్లప్పుడూ అభిమానములను కొనలేని ధనము,అభిమానములను నాశనం చేయగలదు. మంచి మనస్సు గలవారిని కూడా చెడ్డ వారి గా మార్చగలిగే వక్రగుణము డబ్బు కు ఉంటుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి