3, అక్టోబర్ 2023, మంగళవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 53*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 53*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్యాన శిక్షణలో మార్గదర్శకత్వం*:


నరేంద్రుని ధ్యాన శిక్షణలలో శ్రీరామకృష్ణులు ఎలా మార్గదర్శకులయ్యారో పరికిద్దాం. నరేంద్రుడు తెల్లవారుజామున ధ్యానానికి కూర్చునేవాడు. అది సరిగ్గా  ప్రక్కనే ఉన్న జనపనార మిల్లులో సైరన్ మ్రోగే వేళ. గుండెలు అవిసేలా మారుమ్రోగే ఆ ధ్వని ధ్యాన సమయంలో నరేంద్రునికి గొప్ప అవరోధంగా తయారయింది. ఒక రోజు ఈ సమస్యను శ్రీరామకృష్ణులకు చెప్పి పరిష్కారం తెలుపమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, "ఆ ధ్వనిని ఎందుకు అవరోధంగా భావిస్తావు? ఆ ధ్వనిలోనే మనస్సును లీనం చేయడానికి ప్రయత్నించు. అంతా సరిపోతుంది" అన్నారు. ఆ సలహాను తు.చ. తప్పకుండా పాటించిన నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడు కాగలిగాడు.


ధ్యాన సమయంలో దేహబుద్ధి పూర్తిగా నశించి ధ్యేయ వస్తువులో మనస్సు లయించడం లేదని మరొకసారి అతడు శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకొన్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు తమ గోటితో నరేంద్రుని భ్రూమధ్యంలో గుచ్చుతూ, "ఈ నొప్పిలో నీ మనస్సును లీనం చేయి" అన్నారు. ఆ విధంగా మనస్సును లీనం చేయగానే నరేంద్రుడు దేహబుద్ధిని అతిక్రమించి ధ్యానంలో మగ్నుడు అవగలిగాడు. "ఆ నొప్పి ఉన్నంతదాకా, నేను కోరుకొన్నంత వరకూ మనస్సును ఏకాగ్రం చెయ్యగలిగాను. అప్పుడు తక్కిన అవయవాలు ఉన్నవనే జ్ఞాపకం కూడా పూర్తిగా నశించింది. కనుక దేహస్మృతి ప్రశ్నే సమసిపోయింది" అని కాలంతరంలో నరేంద్రుడు చెప్పాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: