3, అక్టోబర్ 2023, మంగళవారం

రామాయణమ్ 343

 రామాయణమ్ 343

...

కామముప్రకోపించి ఆలోచన చెడి ఏమేమో మాటలాడుతున్న రావణుని మాటలు వింటున్నాడు కుంభకర్ణుడు .

ఆయన అసంబద్ధ ప్రలాపనలు  రుచించలేదు కుంభకర్ణునకు  .

.

అందుకే అన్నతో," మహారాజా నీవు సీతను ఎత్తుకు వచ్చుటకు పూర్వమే ఈ పరిషత్తును సమావేశపరచి సలహా సంప్రదింపులు చేసిన ఎడల సబబుగా నుండెడిది! 

.

రావణా ! ఏ రాజు న్యాయాన్ని అనుసరిస్తాడో అతనికి పశ్చాత్తాపము చెందవలసిన సమయము రాదు .

.

నీతి ఏదో ,ఏది నీతికాదో తెలియని వాడే వెనుకచేయవలసిన పనులు ముందు ముందు చేయవలసిన పనులు వెనుక చేయుచుండును.

.

నీవు సరిగా ఆలోచించకుండా ఈ పనికి ఒడిగట్టినావు ,

రామునితో ఉన్న సీత కాలకూటవిషమునిండినమాంసము ,ఆ మాంసము భుజించవలెనని నీకేల ఇచ్ఛ కలిగినది!

.

 నీ అదృష్టము!!

 రాముని కంట నీవుబడలేదు !

.

సరి !!

అయినదేమో అయినది ! 

నీ శత్రువులు నా శత్రువులే వారిని యమపురికి సాగనంపి నీకు చింతలేకుండగ చేసెదను.

.

శత్రువును చంపి నీతిని అవినీతిని సమము చేసెదను ! నీవు నీ భార్యలతో సుఖముగా నుండుము "".

.

నీవు అనాలోచితముగా చేసితివి అని పలికిన కుంభకర్ణుని మాటలు విన్న రావణుని ముఖము కోపముతో జేవురించినది...

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: