🦋🦋🦋🦋🦋🦋🦋
*తపస్సు అంటే ఏమిటి..🙏🏾?*
🦋
సీతకొకచిలుక జననం..*🦋
🦋🦋🦋🦋🦋🦋🦋
ఒక మంత్రాన్నో…, ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే #తపస్సు అనుకుంటే పొరపాటు. ‘తపనే’ #తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే…, ఆరాట పడడమే #తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాట పడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు... తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే…
మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము…. ఈ సృష్టిలో దేనికి లేదు.ఆయుధాన్ని వాడకుండా ఓ మూల పడేస్తే తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదును దేలి.. దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా..
అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు. ‘అయ్యా.. మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.’ నిజమే ఆలోచించడం వేరు... ఆరాట పడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే #తపస్సు అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే #తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతి ని కాంక్షిస్తూ #తపస్సు చేయాలి. అదే నిజమైన #తపస్సు.
#తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా… ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా..? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంత వరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది....
సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోక చిలుక’. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోక చిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోక చిలుకలు రావు. గొంగళి పురుగులు వస్తాయి. ఈ గొంగళి పురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంత కాలం గడిచాక తన జీవితం మీద విరక్తి కలిగి., ఆహార విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశానికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితి లోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అయితే అది గొంగళి పురుగులా రాదు. అందమైన సీతాకోక చిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో
చిక్కుకోక మరణిస్తుంది. అదీ #తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక భగవన్నామామృత పానంతో తరిస్తాడు.
పుట్టిన ప్రతి మనిషి ఒక గొంగళి పురుగులా జీవిస్తూ ఉంటాడు .తరువాత క్రమంలో #తపస్సు (ధ్యానం)చేత నేనే భగవత్ స్వరూపుడను అని తెలుసుకొని ఈ సంసార జగత్తులో చిక్కుకోకుండా అందమైన సీతాకోక చిలుకలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు . ఇదే #తపస్సు (ధ్యానం) ఇచ్చే ప్రతిఫలం...
*సంస్కర్తలు... బ్రహ్మజ్ఞాని.....*
మానవుని ఆయుస్సు వందేళ్లు. రెప్పపాటు జీవితం.
కానీ తానెవడో, ఈ భూమ్మీదకు ఎందుకొచ్చాడో తెలుసుకోకుండా.. ప్రపంచ స్థితిగతుల్ని మార్చాలని తన జీవితమంతా దారబోసి, ఏదో చేయబోతాడు చివరకు ఏదో జరుగుతోంది.. ఇదంతా సంఘసేవ అని చంకలు గుద్దుకుంటాడు. కానీ వాని సిద్ధాంతాలు వలన లోకం మరింత గందరగోళంగా తయారై ఉంటుంది. అప్పటికి వాడుండడు. వాడి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించి, ఉపాధ్యాయులు పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తారు.. "ఆదర్శపురుషులు" అని చెప్పి.
వ్యక్తిగతమైన సంస్కరణలోనే సంఘ సంస్కరణ ఇమిడి ఉంది అన్న గొప్ప రహస్యాన్ని మన ఋషులు కనుగొన్నారు. అందుకే మన ప్రాచీన భారతంలో.. ఋషులు ఉన్నారేగాని సంఘ సంస్కర్తలు లేరు.
అందుకే రామతీర్థులు.. "సంస్కర్తలు కావలెను.. అర్హత: తమను తాము సంస్కరించుకుని ఉండవలెను" అని పత్రికాప్రకటన ఇచ్చారు. దాని అర్థమేమంటే తనను తాను సంస్కరించుకుంటే మరొకరిని సంస్కరించడానికి వానికి ఇతరం, ఇతరులు గోచరించరు.
అందుకే భగవాన్.. ప్రపంచం సంగతి ప్రపంచం చూసుకుంటుంది. నీ సంగతి నీవు చూసుకో అనేవారు. అద్దంలో చూసుకుని తలదువ్వుకుంటే, ఏకకాలంలో ప్రతిబింబంలోని తల కూడా దువ్వబడే ఉంటుంది. ఈ ప్రపంచం తన ప్రతిబింబమే.. ఈ వ్యక్తిగతమైన సంస్కరణలో భాగమే
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమములు.. మన భారతీయ జీవన విధానంలోనే సంఘసంస్కరణ ఇమిడి ఉంది.
"సంఘసంస్కరణ" అనే ఓ ప్రత్యేక కార్యక్రమం ఏమీ అవసరం లేదు. సంఘాన్ని సంస్కరించడానికి కొంపా గోడు వదిలేసి దేశం మీద పడనక్కర్లేదు.. ఎవడికి వాడు వాడి వాకిలి శుభ్రం చేసుకుంటే, ఏకకాలంలో ఊరంతా శుభ్రమౌతుంది.. అంతేగాని నీవు చీపుర తీసుకుని ఊరినంతటినీ శుభ్రం చేయాలనుకోవడం మూర్ఖత్వం...ఆదిత్యయోగి..
వివేకానంద అంతటివాడు విసిగిపోయి.. "ఈ లోకం కుక్క తోక వంటిది. అది అలానే ఉండడం దాని స్వభావం" అన్నారు.. సంస్కర్త తాను జీవించి ఉన్నంతవరకు కుక్కతోకను లాగి పట్టుకుని ఉంటాడు. వాడు మరుగవ్వగానే మళ్లీ వంకరే.
మరి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా.. అంటారేమో.. నిజమే ఆ ఒక్కడు వేదబ్రాహ్మణుడు.
ప్రాచీన భారతంలో చక్రవర్తులు సైతం వారి రాకతో సింహాసనం మీద నుంచి లేచి ఎదురేగి అతిధిసత్కార్యాలు ఘనంగా చేసేవారు.. బ్రాహ్మణుడు అంటే కుల సంబంధమైన వ్యక్తి అని కాదు. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు అని అర్థం.
అనగా.. తనను తాను సంస్కరించుకున్నవాడు అని అర్థం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు వాడు చంఢాలుడైనా సరే వాడు బ్రాహ్మణుడే.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించే సద్గురువును బ్రహ్మజ్ఞాని అనవచ్చు. నిన్ను అంతర్ముఖంలోకి నెట్టేవాడు యెవడైనా సరే వాణ్ణి బ్రహ్మజ్ఞాని అనవచ్చు.
ఎవడి పని వాడు చేసుకుంటే అదే గొప్ప దేశ సేవ అవుతుంది. నీ "కుటుంబం" అనే చిన్న యూనిట్ కు నీవు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగితే చాలు
లోకానికంతా నీవు మేలు చేసినవాడివే అవుతావు
అంటారు ఓ గురువుగారు.. నీవు, నీ కుటుంబం వరకే చూసుకో చాలు.. అనే మాటలు స్వార్థపరమైనవిగా అనిపిస్తాయి. కానీ కాదు.
"సేవ" అనే మాట కంటే మోసపూరితమైన మాట మరొకటి లేదు అంటారు ఆ గురువుగారు. ప్రతి ఒక్కరూ తాను, తన కుటుంబం వరకే చూసుకుంటే.. దేశంలో ఇంతమంది అనాధలు ఉండరు. ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండవు. దేశంలో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరగడం దేశాభివృద్ధి కాదు.
కుటుంబ వ్యవస్థ కుంటుపడడమే వీటికి కారణం.
నేల విడిచి సాము చేయరాదు.. తన్ను విడిచి సేవ చేయరాదు...
.
ఈ శ్రీకృష్ణ రహస్యం..
మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి.
కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు?
ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా?
ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి
ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు?
ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రలెన్నో సహజంగానే వస్తాయి...ఆదిత్యయోగి...
వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్.
శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు కి. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం.
ఉద్ధవుడు : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా.., ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?
కృష్ణుడు : ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా.
ఉద్ధవుడు : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?
కృష్ణుడు : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను.
ఉద్ధవుడు : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?
కృష్ణుడు : ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి.. నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.
అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. పూజలు ఏమీ అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే.. మన జీవితం సాఫీగా సాగిపోతుంది......
🦋🦋🦋🦋🦋🦋🦋A Best Collection from Brahmama Samaakya.
🙏🏾
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి