3, అక్టోబర్ 2023, మంగళవారం

భక్తిసుధ

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


*వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం౹* 

*వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం౹*

*వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతి శాంతాకృతిం౹* 

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


శివస్తుతి - 3


దివ్యమైన వాడు, అచింత్యుడు (మన ఆలోచనకు అందని వాడు), రెండవ సాటి లేని వాడు,   సూర్యుని దర్పమును నాశనము చేసిన వాడు, మచ్చలేని వాడు, ఆరంభమునకు మూలమైన వాడు, నాశనములేని వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసే వాడు, సత్యమైన వాడు, అనంతమైన వాడు, మూలమైన వాడు, భయము లేని వాడు, శాంత స్వరూపుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

కామెంట్‌లు లేవు: