🇮🇳✊
ఒక తొమ్మిది 10 ఏళ్ల క్రితం వరకూ అక్టోబర్ 2 కేవలం ఒకాయన జయంతి మాత్రమే జరిపేవారు..
వీరయోద్ధ లాల్ బహద్దూర్ గారి జయంతి ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు..ఆరోజు ఏదో మొక్కుబడిగా తప్పనితద్దినంగా ( దివంగత ప్రధాని కాబట్టి ) అధికారులు విజయ్ ఘాట్ దగ్గర కాసిని పూలు చల్లి ఓ నాలుగు పాటలు పాడి వెళ్లిపోయేవారు..
సైనిక ప్రధానకార్యాలయాల్లో మటుకు శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళి అర్పించేవారు..తర్వాత కాలంలో పైన వున్న వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తుందో అని అది కూడా తూతూ మంత్రంగా జరిపేవారు..
సోషల్ మీడియా దేశంలో పుంజుకున్న తర్వాత..సోషల్ మీడియాలో జాతీయవాదుల పట్టు బిగిసినతర్వాత..
సోషల్ మీడియాను అల్మోస్ట్ జాతీయవాదులు శాసిస్తున్న సమయం అంటే 2013 నుంచీ అక్టోబర్ 2 అంటే శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అని ఈరోజును వైరల్ చేసింది జాతీయవాదుల సోషల్ మీడియా బృందం.. విజయం కూడా సాధించింది..
మామూలు విజయం కాదు..అద్భుతమైన విజయం.. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మొత్తం గూగుల్ సెర్చ్ చేసి మనకి తెలియని ఆయన త్యాగమయ జీవితం..
యుద్ధ రంగంలో ఆయన పాకిస్తాన్ కొమ్ములు విరిచేసిన సంగతులూ..భారత సైన్యం తన అరివీర భయంకర వీర విక్రమ పరాక్రమాలతో పాక్ లోని రాముడి కొడుకు లవుడు కట్టించిన ' లాహోర్ ' లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అపురూప క్షణాలను కూడా వెలికి తీశారు నేటి తరం..
చాలామంది యువతకు తెలియదు నాడు లాహోర్ దాకా మన భారత సైనికుల విజయయాత్ర సాగిందనీ పాక్ మనకు సాగిలపడిందనీ..
చరిత్రను నేటి యువత తవ్వుతున్నది..ఎన్నో ఎన్నెన్నో దాచిపెట్టిన నగ్నసత్యాలు వెలికితీయబడుతున్నాయి..
మహావీరుల త్యాగాలు వారి వీర గాధలు బయటపడుతున్నాయి..
మనం దేబిరిస్తే స్వతంత్రం రాలేదు..అడుక్కుంటే రాలేదు రాస్ బీహారీ బోస్ దగ్గరనుంచి అరివీర భయంకరుడు స్వతంత్ర భారత తొలిప్రధాని ఫస్ట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ / ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు శ్రీ సుబాష్ చంద్ర బోస్ లాంటి వారి జీవితాలు తృణప్రాయంగా ఎంచి భరతమాత పాదాలకు మువ్వలుగా మారిన త్యాగమయ జీవితాలవలన మనం స్వేచ్ఛగాలులు పీలుస్తున్నాం..మహావీరులైన మనల్ని ఒక పిరికి జాతిగా మార్చడానికి చేసిన కుట్ర అహింసా పరమో ధర్మః.. మనకి ఇంతవరకే భోదించారు.. ధర్మహింసా తదైవచ ఇది చెప్పలేదు..
చరిత్రను తిరగరాద్దాం..ప్రపంచంలోనే ఒక గొప్పజాతి మనది..తిరిగి పునర్వైభవం సాదిద్దాం..ధర్మం కోసం ధనస్సు ఎక్కుపెట్టిన రాముడు మనకి ఆదర్శం..అడుక్కుంటే విజయాలు రావు..రాముడు రావణుడిని బ్రతిమిలాడలేదు..యుద్ధం చేసి గెలిచి అజేయుడయ్యాడు...మన గ్రంధాలు ధర్మం కోసం యుద్ధం చేయమన్నవే గాని..అలిగి అన్నం మానేసి బతిమిలాడమనలేదు..అలా తిన్నది వీరభోజ్యం అనరు..అడక్క తినడం అంటారు..అర్ధం అయితే మంచిది..అర్ధం కాకపోతే మరీ మంచిది..🙏
*JaiJawan*
*JaiKisan*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి