*1940*
*కం*
అక్కర లెరిగిన దేవుడు
చక్కగ తరుగోగణముల సమకూర్చు భువిన్
నిక్కంబెరుగని మూఢులు
గ్రక్కున వారలను ద్రుంచి కడచను సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనుషుల అవసరం తెలిసిన దేవుడు చక్కగా చెట్లను, గోవులను సమకూర్చుతాడు. ఈ నిజం యెరుగక బుధ్ధి హీనముతో వాటిని నాశనం చేసి వారు కూడా నశింతురు.
*సందేశం*:-- చెట్లు, గోజాతులు మనుషులను వ్యాధుల నుండి రక్షించడానికి మనుషుల వద్దకు చేరుతాయి. అవి గుర్తించని మనుషులు వాటిని దూరం చేసుకుని వ్యాధులకు దగ్గర అవుతారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి