6, సెప్టెంబర్ 2020, ఆదివారం

కర్పూర పూలు

కర్పూర పూలు

అవునండీ కర్పూర పూలే

మంచి వాసన ఆహ్లాదం ఇచ్చే తెల్లని పసుపురంగు కలగలిసిన, 

చిన్న చిన్న పూలు ఆకుపచ్చని కాడలపై   
 గుత్తులు గా వేళ్ళాడు తూ 
 చాలా అందం గా ఉన్నాయి .

 వసంత కాల చిత్రం బహు బాగా ఉంది.

అందం కంటే కూడా ఘాటైన వాసనా హాయిగా ఉంటుంది .

 ఆకులు కూడా గట్టి వాసన ఇస్తాయి .

కొంచెం నలిపితే వచ్చే వాసన వెంటనే మనసు కి ప్రశాంతతను ఇచ్చేసింది.

ఏదో తెలియని రిలీఫ్ గా ఉంటుంది.
మింట్ వాసనా? లేక లవంగం వాసనా ? 
అన్నీ కలిపా అర్థం కాలేదు కానీ బావుంది.

 పూల రెక్కలు కూడా మనపై రాల్తుంటాయి పరిమళాల గాలి తో కలిసి.

సిన్నమోనం కాం ఫోర ,లారేసి కుటుంబానికి చెంది దాదాపు వంద అడుగుల ఎత్తులో,

 ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు.
లేత ఆకులు కొమ్మ చివర్లో కుంకుమ రంగులో వచ్చి

 మెల్లగా అకుపచ్చగా మారుతూ పూల లాగానే ఉంటాయి చూస్తూంటే.

 ఆకులపై మైనపు పూత లాగా ఉండి సువాసన కలిగి ఉంటాయి.

 వేర్లు ఆకులు కాండం అన్నీ టి నుండి కర్పూరం తయారు చేస్తారు.

ఒకే విత్తనం ఉన్న కాయలు నల్లగా చెట్టు నిండా కాసి నేల మీదపడి
 చాలా మొక్కలు వస్తాయి.

 పెద్ద కాండం కి ఇరువైపులా ఉండే ముదిరిన కొమ్మల్నీ కట్ చేసి

ఆ మొద్దుల్ని చిన్న చిన్న చిప్స్ గా కట్ చేస్తారు.

వాటిని నానబెట్టి, ఉడికించి
వచ్చే ఆవిరిని
శీతలీకరణ చేస్తే ,

మేజిక్ .

ముద్దలు ముద్దలుగా పచ్చ కర్పూరం తేలుతూ ఉంటుంది 
.
దాన్ని ప్రెస్ చేస్తే కర్పూర తైలం వస్తుంది.
 సహజ కర్పూరం.

చంద్ర భస్మం . భీమ సేన కర్పూరం
అని పురాణకాలం నుండి వంటల్లో , తాంబూలం లో 
 కాటుక లో
 మళ్లీ వైద్య పరం గా వాడే పచ్చకర్పూరం ఇదే.

 మొదటి సారి పూల పరిమళం కంటే ఎక్కువ ఘాటుగా ఉన్న సహజ ప్రకృతి వాసన ఎంతో దూరం వెన్నాడింది.

 ఎంతో కష్టమైన ప్రక్రియ చైనా, జపాన్ ,శ్రీలంక ,ఇండోనేషయా
దేశాల్లో ఎక్కువ.

 బరువు ఎక్కువ నీళ్లలో వేస్తే మునుగుతుంది.

 దాదాపు 15రకాల కర్పురాలు ఉన్నాయి.

కొన్ని సిన్నమొనం జాతుల కాండాల పై గాట్లు పెడితే కారే పాల నుండి కూడా , తీస్తారు

కొన్ని రకాల తులసి ఆకుల నుంచి కూడా స్వేదన ప్రక్రియ ద్వారా కర్పూర తులసి వస్తుంది.

 పెళ్ళిళ్ళలో కర్పూర దండలు వేసుకునే వారట ఇదివరకు . 

 పైన్ చెట్ల జిగురు సేకరించి టర్పైంటిన్ రసాయనం తయారుచేసి ,

 హారతి కర్పూరం తీస్తారు.
 దేవుడి కిచ్చే హారతి కర్పూరం

  ఇది తేలికగా ఉంటుంది త్వరగా నీళ్ళల్లో
 మునుగుతుంది. మనం వాడేది ఇదే. ధర తక్కువ.

అన్నీ స్వేదనక్రియ వలనే

  ఇక మరి మన కల్తీ వ్యాపారం ఉంది కదా .

హెక్సామైన్ వంటి రసాయనాలతో సింతటిక్ కర్పూరం తయారుచేస్తారు

 కెమికల్ ఫాక్టరీ నుండి కిలో 300కి కొనుక్కొచ్చి

మిషన్ తో చిన్న చిన్న బిళ్ళలు చేసి హారతి కర్పూరం అమ్ముతారు. 
ఎక్కువ వాడకూడదు .

 చెట్ల కర్పూరం స్పటికాలు గా ఉండి పారదర్శకం గా ఉంటుంది. 

 కెమికల్ కర్పూరం పిండి లాగా ఉంటుంది.

ఏదైనా దాదాపు ఒకటే రసాయనాలు కలిగి ఉంటాయి.

 గాయాలైన చేతులతో కర్పూరం అంటుకో కూడదు..
బలమైన రసాయన పదార్థం కదా.
కలప గా కూడా ఉపయోగం.

 గాలి వల్ల తయారై గాలి లో కలిసి పోతుంది .

నీళ్లలో కరగదు, నీళ్ళ పైన ఉంచి వెలిగించినా మండుతుంది .

కర్పూరం వల్ల గాలి శుభ్ర పడుతుంది .క్రిమి కీటకాలు దోమలు రావు .

 మూసి ఉన్న గదుల్లో కర్పూరం వెలిగించకూడదు .

11శాతం కంటే కర్పూరం ఎక్కువున్న ఉత్పత్తులను వాడకూడదు
 పచ్చ కర్పూరం వేసిన లడ్డు బావుంటుంది కదా

 కర్ణాటక ఘాట్స్ లో సి. అగస్త్య మలయాళం అనే కర్పూరం చెట్టు కొత్తగా కనుగొన్నారు.

 గట్టి బలమైన వాసనతో ఉంది.
కొన్ని ఆకులు బెరడు తెచ్చి మరిగించి ఆవిరి తీసాము .

 కర్పూర జల్ వచ్చింది మరి చాలా రోజులు పరిమళం ఇస్తూనే ఉంది.

 కర్పూరం బహువచనం లేని ఏకవచనం.
 గుళ్ళో పచ్చ కర్పూరం వేసిన తీర్థం గుర్తుందా గొంతులో చల్లగా ఉంటుంది.

 ఎంటో ఎంత రాసినా ఇంక చెప్పాల్సింది ఎంతో ఉంది . నిజం గానే పాఠం లాగా ఉంది
ప్లీజ్ ఎమీ అనుకోవద్దు.

    రాస్తుంటే కూడా కర్పూర పరిమళం చుట్టూ ముట్టినట్లే ఉంది నాక్కూడా.

కర్పూరం అంత చరిత్ర కల ఘనమైన ప్రకృతి ప్రసాదం .

దైవపూజ చివరి అంకం.

 "కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి సూర్య మివో దితం
భక్తా దాస్యామి నీరా జన మిదం శివం"

కామెంట్‌లు లేవు: