....
లక్ష్మణుడి వీరాలాపములు విని ధైర్యము తెచ్చుకొన్న కౌసల్య రామునితో, నాయనా లక్ష్మణుని మాటలు విన్నావుగా నీకిష్టమయినచో ఈ విషయమున చేయదగిన పనులు చేయి అని పలికింది.
.
నా సవతి మాటలు ధర్మవిరుద్ధము ,న్యాయవిరుద్ధము ! ఆ మాటలు పట్టుకొని నీవు నన్ను వదలి అడవుల పాలవుతావా నాయనా ! వద్దు,వద్దు .నీవిచ్చటనే నాకు శుశ్రూష చేస్తూ ఉండు! .నీవు అరణ్యమునకు వెళ్ళుటకు నా అనుమతి నీకు లేదు ! నాకు ప్రాణత్యాగమే శరణ్యము! .
.
దీనంగా పలుకుతున్న తల్లిని చూసి రాముడు ! అమ్మా ! తండ్రి ఆజ్ఞను ధిక్కరించే సాహసము నేను చేయలేను ,అంత సామర్ధ్యమూ నాకు లేదు!
.
అమ్మా నా తండ్రి ఆజ్ఞ నాకు శిరోధార్యము అదే నా వ్రతము ! తండ్రి ఆజ్ఞ పాటించిన వారెవరికీ ఎటువంటి దోషము కలుగదు!.
.
అని తల్లితో పలికి లక్ష్మణుని వైపు తిరిగి లక్ష్మణా నీ బలము ,తేజస్సు,నేను ఎరుగుదును! అమ్మకు ధర్మము యొక్క రహస్యము తెలియక అంత బేల అయినది!
.
లోకములో అన్నిటికన్నా శ్రేష్టమైనది ధర్మమే! ఆ ధర్మములోనే సత్యమున్నది.మన తండ్రి చెప్పిన వచనములన్నీ ధర్మాశ్రయములే ,అందులో నిస్సంశయముగా ఏ దోషమూలేదు! .
.
నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమించజాలను! .
.
క్షత్రియధర్మములోని ఈ చెడు ఆలోచన నీవు విడువు! క్రౌర్యము వలదు! ధర్మమును శరణువేడు!. నా ఆలోచనను అనుసరించు!.
.
రాముని వదనములో ఏ విధమయిన వ్యాకులత గానీ తొట్రుపాటు గానీ లేవు కేవలము ధర్మాచరణమే లక్ష్యముగా మాటలు చెపుతున్నాడు. రవ్వంత వికారము కూడా లేదు!
.
NB.
.
ఇంకాసేపట్లో పట్టాభిషేకము అంతలోనే ఇంత మార్పు ! ఈ మార్ప ఎవరికి ? మనకు ! చూసేవారికి ! ధర్మమార్గాన్ని అనుసరించే వారికి కాదు ! ఏది ధర్మమో అదే వారి జీవన విధానము అందులో మార్పులేదు! .
.
కానీ మనబోంట్లకు ! ఒక ఊహల అంతస్తునుండి జారిపోయిన భావన ,ఏదో చేజారిందన్న బాధ ! అంత త్వరగా మనకు మనము సర్దిచెప్పుకోగలమా ! Can We shift our ego states.?
.
ఆయన ego state ధర్మమే !ధర్మపధం లో నడవడమే ఆయనకు తెలిసినది!
.
గీతలో భగవానుడు చెప్పినట్లు విషయాలను ఊహించుకొని వాటిమీద మమకారం పెంచుకొని కామ ప్రేరితులమయి అదిదక్కక పోతే క్రోధం లోకి జారి మోహము కప్పివేసి స్మృతి నశించి బుద్ధి అణగారి సర్వనాశనానికి కారణమవుతాము .
.
ఇందుకు,కైకకానీ లక్ష్మణుడు కానీ కౌసల్యకానీ ,దశరధుడుకానీ అతీతము ( exception) కాదు .
.
రాముడొక్కడే ! అవును రాముడు ఒక్కడే ! మర్యాదా పురుషోత్తముడు ఆయన ఒక్కడే!
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి