6, సెప్టెంబర్ 2020, ఆదివారం

పోత‌న త‌ల‌పులో ....(44)


           🌸🌸

కృష్ణా, నీనామ‌స్మ‌రణ‌లో మునిగితేలేవారే
నీ పాద‌పద్మాల‌ను ద‌ర్శించ‌గ‌లుగుతార‌య్యా ,
 అని అంటూ కుంతీదేవీ కృష్ణ‌త‌త్వాన్ని తెలియజేస్తోంది.....

      ****
నినుఁ జింతించుచుఁ, బాడుచుం, బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!

                                     ****
ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతే తప్ప మరింకే ఇతర ప్రయత్నాలూ ఫలవంతం కావు. కృష్ణ‌ప‌ర‌మాత్మా...


🏵️పోత‌న పదం-🏵️
🏵️విముక్తి ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: