6, సెప్టెంబర్ 2020, ఆదివారం

శివామృతలహరి శతకం

    శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

రవ మోంకారము మూలమై వర 'న' కారంబద్ది ఆకాశమై
భువియై మీది 'మ'కార; మగ్నియయి శంభూ!తా'శి' కారంబు,వా
యువు 'వా' కారమునై జలంబది 'య' కారోపేతమై భాసిలన్
శివపంచాక్షరి భూతనాథుజపమౌ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;

*ఓం* కార శబ్దము సృష్టి అంతటికీ మూలమై,
*న* కారము ఆకాశ మై,
*మ* కారం భూమి యై,
*శి* కారము అగ్ని యై,
*వా* కారము వాయువై
*య* కారము జలమై
*ఓం నమః శివాయ* అనే మంత్రము లోని ఒక్కొక్క అక్షరము పంచభూతములైన పృథివ్యప్‌తేజోవాయురాకాశాలలోని ఒక్కొక్క అంశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రకాశిస్తున్నాయి.
అందుకే శివ పంచాక్షరీ మంత్రం
పంచ భూతాలను ఏలే
భూత నాథుడు, పరమ శివుడి జపమే కదా! శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
అని పై పద్యం లో పంచాక్షరీ మంత్రము యొక్క గొప్పతనాన్ని వివరించారు.

కామెంట్‌లు లేవు: