22, మే 2024, బుధవారం

మెచ్చుకోలులో

 మెచ్చుకోలులో మతలబు!


"మెచ్చుడు మెచ్చవచ్చునెడ,మెచ్చకుడిచ్చకు మెచ్చురానిచో,/

మెచ్చియు మెచ్చుమ్రింగకుడు,మెచ్చక మెచ్చితిమంచుగ్రుచ్చలై/

మెచ్చకు,డిచ్చమెచ్చుగనిమెచ్చుడు,మెచ్చనుమానమైనచో /

మెచ్చియు,మెచ్చకుండకయు,మెచ్చుడు,

సత్కవులారమ్రొక్కెదన్!


"ఆంధ్రభాషాభూషణము-మూలఘటిక కేతన.

              తెనుగు భాషకు పద్యాలలో తొలివ్యాకరణం రచించబూనినదిట్ట మూలఘటిక కేతన.ఆకాలంలో విద్యాలయాలను ఘటిక లనేవారు.అలాంటి విద్యాలయానికాతడు అధికారి.తిక్కనకు ప్రియశిష్యుడు.దండి దశకుమార చరిత్రము ననువదించి తిక్కనకు కృతినొసంగినమహనీయుడు.

"తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును,

దానివలన కొంతగానబడియె,

కొంత తానగలిగె నంతయునేకమై

తెనుగుబాసనాగ వినుతికెక్కె;-అంటూ తెలుగు సంస్కృత జన్యమని నొక్కి వక్కాణించినవాడు. 


ప్రస్తుతానికివద్దాం.

సత్కవులకు మ్రొక్కుతూ అవతారికలో కవిచెప్పిన మాటలే పైపద్యం.


భావం:నాగ్రంధంలో నచ్చినవిషయంమీకు కనిపిస్తే మెచ్చుకోండి.మీమనస్సుకు నచ్చకపోతే మెచ్చుకోకండి.మనస్సులో మెచ్చుకుంటున్నా పైకి గాంభీర్యంనటిస్తూమెచ్చనట్లు ప్రవర్తించకండి.నచ్చకపోయినా కుటిలురై నచ్చినదని మెచ్చుకోకండి.మనఃపూర్వకంగా మెచ్చుకోండి.మీకు మెచ్చు అనుమానమైతే మెచ్చిమెచ్చనట్లుమెచ్చుకోండి. సత్కవులారా! మీకిదే నాప్రణామములు.

            మెచ్చు అనే క్రియను వృత్యనుప్రాసముగా నుపయోగించి అశేషవిమర్శకుల యభిప్రాయములెట్లుండునో సద్విమర్శయెటులుండవలెనో కేతన నిపుణముగా సూచించినాడు.నేడిట్టికవులొక్కరైననుగలరా? సంశయమే!


                               స్వస్తి!

కామెంట్‌లు లేవు: