22, మే 2024, బుధవారం

బుద్ధాయ పరమాత్మనే

 *నమో వేదాత్మనే తుభ్యమ్*


నామసామ్యత చేత ఇద్దఱు బుద్ధులు ఒకరనే భ్రమ ఏర్పడుటకు అవకాశము కలిగినది. ద్వాపర యుగమున కూడా వాసుదేవుఁడను పేరున ఇద్దఱుండిరి. పౌండ్రక వాసుదేవుడను వాడిని వాసుదేవుడైన శ్రీకృష్ణుడు వధించెను.

   శ్రీ విష్ణుమూర్తి అనంతావతారములలో దశావతారములు ప్రసిద్ధము. ఒక్కొక్క కాలమున ఒక్కొక్క అవతారము వైదిక ధర్మరక్షణము బాధ్యతగా ఏర్పడినది. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణమైన పిదప యాదవుల అనైక్యత తదితరములు పెౘ్చుపెరిగినవి. ఇవి క్రమముగ నాస్తిక, అవైదిక, నిర్హేతుక సిద్ధాంతముల వ్యాప్తికి, అనుసరణకు కారణభూతములయినవి. 

   వేదోద్ధార విచారగతి శీలుడయిన నారాయణుఁడు వైదికమార్గ పరిరక్షణకై అవతరింప సంకల్పించినాడు.


*బుద్ధదేవ-గౌతమబుద్ధ* భేదాలు...

1.

బు.దే.: హిమాలయముల మధ్యప్రదేశమైన కపాల పర్వత శ్రేణులలోని శంబళ గ్రామమున ఆవిర్భవించినాడు. 

గౌ.బు.: మగధదేశమున మాయాదేవీ శుద్ధోదనులకు జన్మించినవాడు.

2.

బు.దే.: త్రిపురములను జయించినాడు.

గౌ.బు.: త్రిపిటకములు (సూత్ర-నియమ-అభిధర్మ) రచించినాడు.

3.

బు.దే.: శిఖా ప్రాధాన్యత నిలబెట్టినాడు

గౌ.బు.: నిండు ముండనము ఉండాలన్నాడు.

4.

బు.దే.: దేవతారాధన విధానము గొప్పదన్నాడు.

గౌ.బు.: విగ్రహారాధన వద్దన్నాడు.

5.

బు.దే.: ధర్మబద్ధమైన సంసారము మోక్షానికి అడ్డుకాదన్నాడు.

గౌ.బు.: మోక్షానికి సంసారము ఆటంకము అన్నాడు.

6.

బు.దే.: వేదములు చెప్పినదంతా సత్యమన్నాడు.

గౌ.బు.: వైదికమార్గము ఐనుసరింౘకూడదన్నాడు.

7.

బు.దే.: శబ్దగుణతత్వ ఆకాశము పంచభూతాలలో ఒకటి అన్నాడు.

గౌ.బు.: ఆకాశమును భూతముగా అంగీకరింౘలేదు.

8.

బు.దే.: బుద్ధ్యా వైదికమ్ ధర్మమ్ గృహ్యతే ఇతి బుద్ధః

గౌ.బు.: సర్వమ్ క్షణికమ్ నశ్యతే ఇతి బుద్ధ్యతే బుద్ధః

9.

బు.దే.: దానవసతి శీలరక్షణము చేసినవాడు.

గౌ.బు.: ధర్మపత్ని శీలమును కూడా నిరాకరించినవాడు.

10.

బు.దే.: పరమాత్మ అస్తిత్వమును సత్యమని వ్యిప్తిచేసినవాడు.

గౌ.బు.: పరమాత్మ స్వరూపమును గుర్తింౘనివాడు.


*బుద్ధాయ పరమాత్మనే*


స్వస్తి ప్రజాభ్యః...


                     •••••

       గోలోకాశ్రమ సేవామండలి.

కామెంట్‌లు లేవు: