22, మే 2024, బుధవారం

మహావైశాఖీ

 *రేపు 23/05/2024 మహావైశాఖీ* 

*వైశాఖశుక్ల పూర్ణిమా మహావైశాఖీ| యద్యవ్యస్యా యోగవ దేవ మహత్వసంజ్ఞ తథాపి వైశాఖాషాఢ కార్తికమాఘపూర్ణిమానాం యోగమన్తరేణాప్యతీవ పుణ్యద్వన్మహత్వ సంజ్ఞా! తథా చోక్తం నిర్ణయసిస్ధా భవిష్యే- వైశాఖీ కార్తికీ మాఫీ హ్యాషాఢ్యప్యతి పుణ్యదాః|* 

*స్నానదానవిహీనా పై తాసు గౌరవగామినః|| ఇతి అస్యాం దధ్యన్నవ్యజనచ్ఛత్రపాదుకోపానహదానాని కర్తవ్యాని| తథా చోక్తమ్ దన్నవనం ఛత్రం పాదుకా ప్రదాపయేది| వైశాఖ్యం విప్రముఖ్యేభ్యో మోదతే విష్ణుమన్దిరే|| ఇతి|*


*వైశాఖ పూర్ణిమ* వైశాఖ శుద్ధపూర్ణిమను మహావైశాఖి యందురు. యోగవిశేషముచే వైశాఖ ఆషాఢ కార్తిక మాఘ పూర్ణిమలు మహత్వ సంజ్ఞను కలిగియుండును. ఈ మహాపూర్ణిమలందు స్నానదానాదులు చేయనివాడు రౌరవాది నరకములకు పోవునని నిర్ణయసింధుపు, భవిష్యపురాణములు చెప్పుచున్నవి. ఈ పూర్ణిమనాడు దధ్యన్నము, విసనికఱ్ఱ, గొడుగు, పావుకోళ్ళు, చెప్పులు మొ|| మహాదానములను చేయవలెను. అట్లాచరించినచో విష్ణుమందిరమును జేరి యానందించునని చెప్పబడినది.

కామెంట్‌లు లేవు: