మోక్షానికి అర్హత
వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి 6
ఒకడు ఎన్ని శాస్త్రప్రసంగములనైనను వివరించవచ్చును. ఎందరు దేవతలను ఉద్దేశించి యైనను యజ్ఞవిధుల నాచరింపవచ్చును. ఎన్ని శుభకర్మములైనను చేయవచ్చును. కాని వానికి బ్రహ్మము, ఆత్మయు నొక్కటియే యను జ్ఞానము కలుగనంత వరకు నూర్గురు బ్రహ్మల కాలము గడచినను ముక్తి లభింపదు.
("చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దిన ముచ్యతే” అనగా నాలుగువేల యుగముల కాలము బ్రహ్మయొక్క ఆయువులో ఒక్క దినము, అంతియే కాలము రేయి యగుచుండును. ఈ క్రమమున నూరు ఏండ్లు అయినచో ఒక కల్పముగా బ్రహ్మయొక్క ఆయువగును.)
ఇక్కడ శంకరులవారు మనకు భగవత్పరంగా ఎన్ని కర్మలు చేసినా అంటే పూజలు, జపాలు, వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా కూడా మోక్షం సిద్దించ్చదు అని అనటమే కాకుండా ఒక మానవులు వంద బ్రహ్మ కల్పములు కష్టపడినను వృధా అని అంటున్నారు. సాధారణంగా ఒక మానవుని ఆయుర్దాయము 100 సంవస్త్సరాలు అన్ని అన్నకూడా మనకు తెలుసు ఒక మానవుడు సగటున 70 సంవత్సరాలు కూడా బ్రతకటం లేదు. అందునా మొదటి 15 సంవత్సరాలు ఇతర వ్యాపకాలవలన బుద్ధిహీనుడిగానే పేర్కొనవచ్చు. ఆ తరువాత ఒకనికి దైవచింతన కలిగితే కలగవచ్చు. అదికూడా అనుమానాస్పదమే. నేను కొందరు మిత్రుల తమకు తాము ఆధ్యాత్మిక చింతనలో ఉన్నామని అనుకునే వారిని అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాదానాలు చాలా విడ్డురంగా ఉంటున్నాయి. ఒకరు మనం ఈ జన్మలో భక్తి కలిగి ఉంటే చాలు అని ఇంకొందరు మనం జపం చేస్తే చాలు గాయిత్రి పరమో మంత్రః అన్నారు కదా రోజుకు 108 గాయిత్రి చేస్తే సరిపోతుంది అని నేను ఫలానా బాబాను నమ్ముతాను ఆయనే అన్ని చూసుకుంటాడు. అయన తలచుకుంటే మోక్షం ఇవ్వగలడు అని ఇలాంటి సమాదానాలు చెపుతున్నారు.. వీటికి ఏమిటి కారణం అంటే వారికి ఇంకా కర్మపరిపక్వత రాలేదు అని నేను అనుకున్నాను. నేను మాట్లాడినవారు అందరు 70 ఏళ్ళ పైబడినవారే. వారి పరిస్థితే ఇలా ఉంటే మంచి 20,30 యెల్లవాళ్ళు మోక్షార్థులు ఎలా అవుతారు.
ఇంకా వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి