19, మే 2024, ఆదివారం

సౌందర్య లహరి*

 *సౌందర్య లహరి* 

 *అరవై రెండో శ్లోక భాష్యం (62).* 


 *(శ్రీ శంకర భగవత్పాద విరచితము)* 


 *(శ్రీ లలితాంబికాయైనమః)* 


 *ఈ శ్లోకంలో శ్రీదేవి క్రింది పెదవి (అధరోష్ఠం) వర్ణించబడింది.* 


 *"ప్రకృత్యా రక్తాయా _ స్తవ సుదతి దన్తచ్ఛదరుచేః* 

 *ప్రవక్ష్యే సాదృశ్యం _ జనయతు ఫలం విద్రుమలతా !* 

 *న బింబం తద్బింబ _ ప్రతిఫలన రాగాదరుణితం* 

 *తులా మధ్యారోఢుం _ కథమివ న లజ్జేత కలయా !!"* 


చక్కని పలువరస గల దేవీ ! స్వభావము చేతనే ఎర్రనైన నీ పెదవుల 

కాంతికి పోలికను చప్పాలంటే ఈ ప్రపంచము లో ఏమీ కనబడవు.

ఎందువల్ల అంటే, నీ క్రింది పెదవి , సహజముగానే ఎర్రని కాంతికలది.

ఒకవేళ పగడపు తీగకు పండు పండినట్లయితే ఆపండుకు , నీ పెదవితో 

సామ్యము లభించవచ్చు. దొండపండుతో నీ పెదవి కి పోలిక చెపుదామని 

యనుకున్నా, అది కుదరదు. ఎందుకంటేదొండ పండునకు ఉన్న ఎర్రని

కాంతి సహజమైనది కాదు. దొండపండునకు "బింబము" అనిపేరు. 

బింబము అంటే ప్రతిఫలించిన రూపము . దొండపండుకు ఎర్రదనం

దేవి పెదవులు దానిలో ప్రతిఫలించడం వల్ల వచ్చింది. అందుకే దానికి

బింబము అని పేరు వచ్చింది. కాబట్టి బింబము, నీ పదవితో పదహారవ

పాలుతోనైనా సామ్యమును పొందడానికి సిగ్గు పడకుండా ఎలా

ఉంటుంది. (అంటే సహజమైన ఎర్రదనం గల నీ పెదవితో సామ్యానికి

రావడానికి ప్రతిఫలనం వలన ఎర్రబడిన బింబము అంటే దొండపండు

తప్పకుండా సిగ్గు పడుతుందని భావము. నీ పెదవితో దొండపండు, 

కనీసము పదహారవ వంతు పాలు పోలికయినా రాలేదని భావము).


 *ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యైనమః* 

 *ఓం కరాంగుళీనఖోత్పన్ననారాయణదశాకృత్యైనమః* 

 *ఓం మహాపాశుపతాస్త్రగ్నినిర్దగ్దాసురసైనికాయైనమః*


 *ఓం శ్రీ మాత్రే నమః*

కామెంట్‌లు లేవు: