*గురువు ఉపదేశం వలననే ఆత్మదర్శనం పొందగలం*
"మనిషికి నిజమైన యజమాని ఎవరు?" అని అడిగితే భగవంతుడు గీతలో తన వాడు అని స్పష్టంగా చెప్పాడు.
మామూలుగా అయితే మనకు ఎవరిద్వారా మేలు జరుగుతుందో వాళ్ళే మన యజమాని. అలా చూసే వారికి "ఏం బావుంది నీకు?" అని అడిగితే, "ఈ సంసార బంధం నుండి విముక్తి నాకు మంచిది" అని సమాధానం. మన కోసం మనం మాత్రమే దీన్ని చేయగలం మరెవరూ చేయలేరు.
సంసారసాగరంలో మునిగిపోయిన తనను తాను రక్షించుకోగలగడానికి రక రకాలుగా మార్గాలను చాలా మంది చెప్పారు.
ఇది ఎప్పుడు ముగుస్తుంది? అంటే, మనస్సును బాహ్య విషయాల నుండి ఆత్మ వైపు మళ్లించడం ద్వారా మాత్రమే.
ఇది జరగాలంటే, ప్రాపంచిక వ్యవహారాలపై పూర్తిగా అవగాహన ఉండాలి. ప్రాపంచిక విషయాలు అల్పమైనవని నిశ్చయించుకోవడం వల్ల ఈ వైరాగ్యం కలుగుతుంది. అందుకు గురువుగారి అనుగ్రహం చాలా అవసరం. ఈ విధముగా ఎవరైతే గురువు ఉపదేశము వలన ఎక్కువ వైరాగ్యమును పొందుతారో, అతడు ఆత్మ దర్శన యోగ్యతను పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారికి మాత్రమే జన్మ సార్థకం (సాఫల్యం) లభిస్తుంది. ఎన్ని విద్యలు చేసినా ఆ విద్య అంతిమంగా ఆత్మ దర్శనానికి సాధనం కావాలి.
*సా విద్యా యా విముక్తయే* అని ప్రాచీనులు చెప్పిన దానిని మరువరాదు. ఆత్మ దర్శనానికి ఉపయోగ పడని సాధన సాధన కానే కాదు.
-- *జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా స్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి