19, మే 2024, ఆదివారం

వ్యాస వాఙ్మయము

 *వ్యాస వాఙ్మయము - విశ్వ చేతనము*


మహాభారతము- అనుశాసన పర్వము- దానధర్మ ఉపపర్వము...


మార్కండేయ - నారదర్షి సంవాదము;


*మా -* సజ్జనులతో సంభాషణము వలన ప్రయోజనము ఏమిటి?

*నా -* ధర్మాచారముల పట్ల శ్రద్ధ


*మా -* కలియుగానికి ఉన్న మఱియొక పేరేమిటి?

*నా -* నాలుగవ యుగము పేరు నందికము


*మా -* నియమ రహితంగా చేసే దానఫలము ఎవరికి అందుతుంది?

*నా -* అసుర, రాక్షస, ప్రేత, భూతములకు


*మా -* కన్యాపూజ ఎందుకు చేయాలి?

*నా -* కన్యలలో లక్ష్మీదేవి నిత్య నివాసినిగా ఉంటుంది కనుక...


*మా -* పతివ్రత గొప్పదనము ఏమిటి?

*నా -* గృహలక్ష్మి, గృహపుష్టి, గృహ ప్రతిష్ఠలకు ఆధారము పతివ్రతయే


*మా -* మనిషి శరీరంలో ఉన్న ఐదు తీర్థాలు ఏమిటి?

*నా -* దేవతీర్థము, ఋషితీర్థము, పితృతీర్థము, బ్రహ్మతీర్థము, విష్ణుతీర్థము


*మా -* ఆ తీర్థాల స్థానాలు ఎక్కడ?

*నా -* వ్రేళ్ళ చివరన దేవతీర్థము,

  చిటికెన వేలు ఉంగరపువ్రేలు మధ్యన ఋషితీర్థము,

  బొటనవ్రేలు ౘూపుడువ్రేలు నడుమ పితృతీర్థము,

  బొటనవ్రేలి చివరన బ్రహ్మతీర్థము, 

  అరచేతి మధ్యన విష్ణుతీర్థము.


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

కామెంట్‌లు లేవు: