19, మే 2024, ఆదివారం

ప్రాణం వున్నది

 14 -7 -1949 భగవాన్ కి ఆపరేషన్ జరిగిన తరువాత  చేతికి వచ్చిన పుండు నుండి రక్తం కారుతుంది.  ఆ నొప్పికి జ్వరం వచ్చి   శరీరం వణుకుతూ తులసాగింది. ఎట్లాగో వచ్చి సోఫాలో కూలబడ్డారు. అందరూ భయకంపితులై విచారిస్తూ దూరంగా ఉన్నారు. శాంతమ్మగారు పెద్దది గదా!దుఃఖం ఆపుకోలేక కళ్ళనీళ్ళు కారుస్తూ భగవాన్ సోఫా చుట్టూ పెట్టిన కర్ర కటకటాల నానుకొని శ్రీవారి నుద్దేశించి " అయ్యో ! శరీరం " అని అన్నదో లేదో భగవాన్ అందుకొని " ఓహో ! శరీరమా ? ఏమి , ఏమయింది , వణుకుతున్నది . వణికితే యేమి ? ఈ శరీరంలో ప్రాణం గదా వుండాలి మీకు . ప్రాణం వున్నది , సరేనా ? " అంటూ ఈ వణుకంతా అణుచుకొని నవ్వుతూ పక్కనున్న సేవకులతో “ అది నటరాజ తాండవమయ్యా . భయమెందుకు ? నిత్యం అచల దర్శనమైతే ఇవాళ తాండవదర్శనం . దీనికంత గాభరాయెందుకు ? " అని సెలవిచ్చి గంభీరంగా కూర్చున్నారు భగవాన్ .    

          

         *"నా రమణాశ్రమ జీవితం గ్రంథంనుండి".*   

                 🌹అరుణాచల ఆత్మానంద 

             ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏

కామెంట్‌లు లేవు: