19, మే 2024, ఆదివారం

అల్సర్ - అలక్ష్యం*_

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 

🙏🌻🌻🌻🌻🕉️🌻🌻🌻🌻🙏


🪷 _*అల్సర్ - అలక్ష్యం*_ 🌹 


ఒకసారి భక్తుల గుంపొకటి కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికని కంచి వచ్చారు. వారంతా కన్యాకుమారి, తిరుచెందూర్, మధురై, తిరుచ్చి, తంజాఊర్, కుంబకోణం, తిరువనంతపురం దర్శించుకుని కంచికి వచ్చారు. 


అది కామాక్షి అమ్మవారికి అభిషేక సమయం కావటంతో ఇంకా ఒక గంట పట్టేటట్టు ఉంది అని నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ సమయంలో పరమాచార్య స్వామివారిని దర్శించుకుందామని నిశ్చయించుకుని అందరూ బయలుదేరారు ఒక్కజంట తప్ప. 


అతను మరొక శంకరాచార్య స్వామి మఠం భక్తుడు కావడంతో పరమాచార్య స్వామివారికి నమస్కారం పెట్టడం ఇష్టం లేక అక్కడే అమ్మవారి గుడిలోనే ఉండిపోయాడు. 


చాలాసేపటి తరువాత కూడా వెళ్ళినవారెవరూ తిరిగి రాకపోవడంతో వారిని వెతుక్కుంటూ ఇతను కూడా శ్రీమఠం లోనికి వచ్చాడు. ఆ దంపతులిద్దరూ ప్రవేశిస్తున్నప్పుడు మహాస్వామివారు త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరునికి హారతి ఇస్తున్నారు. మొత్తం పూజ పూర్తైన తరువాత స్వామివారు కిందకు వచ్చి అందరికి తీర్థప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వరుసలో అందరితోపాటు వస్తున్నాడు. 


ఇతని వంతు రాగానే మహాస్వామివారు ఇతని పేరు, అతని తండ్రి గురించి, వారి గోత్రం, కేరళలో వారు కట్టుకున్న ఇల్లు, తోట గురించి అన్నీ మాట్లాడారు. ఒక కమలాపండుని స్వామివారి కడుపుపై తిప్పుతూ ఈ విషయాలన్నీ అతనితో మాట్లాడుతూ స్వామివారు. దాదాపు ఒకగంట సేపు అతనితో మాట్లాడి ఆ పండుని అతనికి ప్రసాదంగా ఇచ్చారు. 


అతనికి కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) ఉండడం వల్ల డాక్టర్ల సలహామేరకు ప్రతి ఇరవై నిముషాలకు ఒకసారి ఏదైనా తినాలి, లేదా కనీసం మంచినీరైనా తాగాలి. కాని స్వామివారితో మాట్ళాడుతూ ఉండడం వల్ల అతను సమయం చూడక ఒక గంట పాటు ఏమి తినకుండా అలాగే ఉండిపోయాడు. బయటకు రాగానే విషయం గుర్తుకు వచ్చి గభాల్న ఆ కమలాపండుని తినేసాడు. 


అప్పటి నుండి అతని జీవితాంతం వరకు అతనికి ఎటువంటి అల్సర్ కాని నెప్పి కాని లేక హాయిగా జీవించాడు. పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తుడై రెండు శంకర మఠాలను సేవిస్తూ కాలం గడిపాడు. 


_/\_ శంకరం శంకరాచార్యం తత్ పీఠాధీశ్వరం _/\_


        ❀┉┅━❀🕉️❀┉┅━❀

*జయ జయ శఙ్కర హర హర శఙ్కర*

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🕉️🌻

కామెంట్‌లు లేవు: