నీభాగ్యంబుసామాన్యమే!!
బ్రాహ్మీదత్తవరప్రసాదుడ,వురుప్రజ్ఞావిశేషోదయా
జిహ్వస్వాంతుడ,వీశ్వరార్చన కళాశీలుండ ,వభ్యర్హిత
బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్ధ నిర్ధారిత
బ్రహ్మజ్ఞానకళా నిధానమవు,నీభాగ్యంబుసామాన్యమే!!
శృంగారనైషధం-శ్రీనాధకవిసార్వభౌముడు.- అవతారిక-13పద్యం!!
కాశీఖండమయః పిండమ్-నైషధం విద్వదౌషధం-అనేది పండితవాక్యం.ఇది
హర్షనైధమునకే వర్తించునని కొందరందురుగాక! శ్రీనాధకృతికిని ఇదివర్తించునన్నది,
ఈపద్యమేనిరూపణము.
శ్రీహర్షుని కృతినాంధ్రీకరింపవలెనన్న ఆకవి కెంతసత్తువకావలెను.ఎన్ని విషయములు తెలియవలెను. ముందు
ఆతడుసరస్వత్యుపాసకుడైనకాని సాధ్యపడదు.ముందుగాశ్రీనాధునకు గలయోగ్యలెట్టివో పరిశీలింపుడు.
1 బ్రాహ్మీదత్తవరప్రసాది. ఉపాసనాబలం
తనబలంగా జోడించుకున్నవాడు.కాబట్టి రచనకు తిరుగుండదు.
2ఉరుప్రజ్ఞావిశేషోదయాహిజ్వస్వాంతుడవు."ఉరుప్రజ్ఞ-అంటే కావ్యోత్పత్తిహేతువులలో ముఖ్యమైన "ప్రతిభ"- ఆప్రతిభాసమున్మేషంలో ఆదిశేషునిప్రభావగుంభితమనంబుగలవాడవు.
3ఈశ్వరార్చన కళాశీలుండు.
పరమేశ్వరారాధన మొకకళగా నెరిగినవాడు.శివారాధనాతత్పరుడు.
శివార్చనాఫలము అష్టవిధవిభూతులు.
అందులో వశిత్వమున్నది.అదియే కావలసినది తలచినంతనే మూలకావ్యార్ధమంతయు వశమే!
4అభ్యర్హితబ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్ధ నిర్ధారిత
బ్రహ్మజ్ఞానకళానిధానం. అష్టాదశపురాణసముదాయమునగలతాత్పర్యార్ధమునందుసూచింపబడిన
పరంబ్రహ్మస్వరూపమును నిరూపణముచేయగలవాడు.
ఇదీ శ్రీనాధునికవనసత్వము.
కవితాసామర్ధ్యము.
ఈమాటలు శ్రీనాధకృతి స్వీకృత సుకృతి మామిడి సింగనా మాత్యుని మాటలు!
"అహో !కవిసార్వభౌమా!శ్రీనాధకవీంద్రా!నీకవనసామర్ధ్యముఅపురూపము,అనన్యసామాన్యము.
"నాస్తియేషాం యశఃకాయే జరామరణజం భయమ్!!
స్వస్తి!🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి