24, నవంబర్ 2020, మంగళవారం

కార్తీక పౌర్ణమి

 కార్తీక పౌర్ణమి... 29-11-2020 ఆదివారం రోజు ననా ? లేక? 30-11-2020 సోమవారం రోజా అని చాలా మంది తెలియక అడుగుతున్న ప్రశ్న🌹*





శ్లో.ఉదయస్థా తిథిర్యాహి

నభవేద్దిన మధ్యగా!

సా ఖండా న ప్రధానాస్యాత్ 

వ్రతారంభే సమాపనే!!


సూర్యోదయము మొదలు మధ్యాహ్నకాలము వరకునున్న తిథి, నక్షత్రంబులను ఆఖండంబులనియు - ఇవి వ్రతారంభ, ఉద్యాపనములకు యోగ్యమైనవి..... 


సమాధానం:- శాస్త్ర ప్రకారం

కార్తీక పౌర్ణమి నాడు  స్నానం చేసి అనంతరం ఉపవాసానికి సంకల్పం చేసి  సాయంత్రం విశేషించి (365 వొత్తుల) దీపారాధనలు చేయాలి.... 

అలా చేయాలంటే  ఆదివారం సాయంత్రం దీపారాధనలు చేసేవేళలో పౌర్ణమి ఉన్నా...

ఉదయం వేళ సంకల్పానికి పౌర్ణమి లేదు కనుక ఉపవాసానికి ఆదివారం పనికి రాదు.... 

ఉపవాసం లేకుండా సాయంత్రం విశేష దీపారాధనలు, పూజలు ఫలాన్ని ఇవ్వవు.... 

*స్నానాలకి, దానాలకి, ఉపవాసానికి, సాయంత్రం (365 వొత్తుల) దీపారాధనలకి సోమవారం నాడే చేయవలెననేది సశాస్త్రీయమైన నిర్ణయం...*



*దేవాలయాలలో జ్వాలాతోరణం ఇత్యాదులు ఆదివారం 29/11 / 2020...*


రాత్రికి పౌర్ణమి చేయవలసినవారు తె29/11/2020ది ఆదివారం చేయవలెను.


ఉదయం చేయవలసినవారు తే30/11/2020ది సోమవారం చేయవలెను


*గురువు గారు సశాస్త్రీయమైన నిర్ణయం తెలిపారు .*


కృత్తికా నక్షత్ర సహిత పౌర్ణమి ఘడియలు ఆదివారం రాత్రి ఉన్నాయ్ .

సోమవారం పూర్తిగా రోహిణీ నక్షత్రం .

పూర్ణిమ నాడుకృత్తికా నక్షత్రముంటుందనే మాసనామం కార్తికమంటారు .

ఆదివారం సెలవు కావున భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భావన ఉండవచ్చు .

అందుకే కార్తిక దీపం ,జ్వాలా తోరణాలు ... ఆదివారం చేస్తుండవచ్చు .

ఈమధ్య వివాహాలు , ఫంక్షన్లు...కూడా శని ,ఆదివారాలలో కావాలంటున్నారు .

శాస్త్రదృశ్యం , గురుర్వాక్యం ,ఆత్మనిశ్చయం అంటారు .

కానివ్వండి .

దీనికి వివాదం ,కురుక్షేత్ర యద్ధం ఎందుకు ?  !

అన్నట్లు మరిచాను . 

కార్తిక బహుళ అమావాస్య కురుక్షేత్రయుద్ధ ప్రారంభం. 

గీతాజయంతి ఆరోజువై అన్నారు . మార్గశిర శుద్ధ ఏకాదశి చేస్తారందరున్నూ .

తప్పు అన్నారు .

భీష్ములవారు అంపశయ్యాగతులైన తర్వాత అంతవరకు యుద్ధంలో విజయం కౌరవులదే అని మిన్నకున్న ధృతరాష్ట్రులవారు సంజయున్ని పిలిచి 

..మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ..

అని ప్రశ్నించడంతో భగవద్గీత ప్రపంచానికి వెల్లడి అయింది .కావున మార్గశీర్ష శుక్ల ఏకాదశి గీతాజయంతి సెలబ్రేషన్స్ అన్న వివరణతో ఆ చర్చ సమసి పోయింది .

కృష్ణ పరమాత్మ అన్నీ చెప్పి 

' యథేచ్ఛసి తథా కురు ' అన్నారు .

విజయుడు ' కరిష్యే వచనం తవ '  అన్నాడు .

అలాగే శాస్త్రోక్తరీతి చెప్పబడింది . ఆవల ఎవరి మనోధర్మం/సౌకర్యం వారిది .


*దేశ కాల దేహ ధర్మ  వైపరీత్య శంకయా ప్రమాణేన...*

గురుర్వాక్యం సమకాలీనం .

అనుసరణీయం .


అదే విధి గా ఆచరిస్తున్నపుడు విశ్వాసం కూడుకుంటుంది . కార్యసిద్ధి కూడా .


సందేహాత్మా వినశ్యతి ..


నిర్ణయం ముందు చర్చ .

నిర్ణయమైపోయిన తర్వాత తర్కం కూడదు.🙏

కామెంట్‌లు లేవు: