కరోనావ్యాధి కేవలం మానవులకు తప్ప మరే జీవికి లేదని తెలియజేస్తూ ఒక వ్యంగ్యాత్మక సీసపద్యం.
సీ!! కాకికక్కర లేదు గద! ఐసొలేషను
కోతికి లేదయ్య కొవిడు బాధ
లేదు గద! కరోన లేదయ్య కుక్కకు
మదపుటేనుగునకు మాస్కు లేదు
మరి చీమకేది సామాజిక దూరమ్ము
టాంకు చేపకు శానిటైజరేది
పాము జాతికి యేది హోము క్వారంటైను
నక్కలకేదయ్య లాక్కుడౌను
కోడికి లేదయ్య కోవిడు పాజిటివ్
గొర్రెకు గ్లౌజేది వెర్రివాడ!
పిట్టకు లేదయ్యె చట్టమొక్కటియైన
ఏ జీవికిని లేదు యింత దిగులు
తే!! జీవులన్నియు తమతమ జీవితమును
ధర్మమార్గాన ప్రకృతిన దనరుచుండ
మనిషి యొక్కడె మితిమీరి మసలుకొనుచు
ఇట్టి దుర్భర దుస్థితి నేడ్చుచుండె.
🌸🙏🙏🙏🌸
ఇది ఎవరో పెద్దవారు వ్రాసినది పంచుకోవటమైనది... 🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి