*🙏నమస్కారములు🙏*
నమస్కారములు చాలా విధములు అందు అతి ముఖ్యమైనవి నాలుగు...
*1. సాష్టాంగ నమస్కారము:-*
ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా
పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”...
1. కాళ్ళు,
2. చేతులు,
3. ముక్కు ,
4. చెవులు,
5. ఉదరము,
6. కళ్ళు,
7. నోరు,
8. మనస్సు...
*ముఖ్యగమనిక :-*
స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి.
స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి...
*2. పంచాంగ నమస్కారము*...
పంచాంగములు:
1. అరి చేతులు,
2. మోకాళ్ళు,
3. మోచేతులు,
4. పాదములు,
5. శిరస్సు...
*3. అభివాద నమస్కారము*
ప్రవరతోటి చేయు నమస్కారము, అభివాద నమస్కారము నిలబడి చేయరాదు, పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి...
*గురువుగార్లను, ఆచార్యదేవులను, వేదపండితులను, నిత్యాగ్నిహోత్రులను, వయో వృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.*
*4. ప్రణిపాతము:-*
ఆర్తితో చేయు నమస్కారము,
నేలమీదపడి నమస్కారము చేయడము...
“హృదయ క్షేత్రాలలో ‘భక్తి,’ అనే బీజాలను నాటండి. దీనిని మనస్సు అనే నీటితో తడపండి...
దానికి నాలుగు దిక్కుల ‘సంత్సంగం’ అనే కంచె వేయండి. దానివలన ‘కామాది వికృతరూప, పశువులు’ రాకుండా ఉంటాయి.
మనమీ విధంగా వ్యవహరిస్తే .... ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో ‘ శాంతి’ ‘ఆనందం’ అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”
నమస్కార పద్ధతులు[1)
1. మూడు పద్ధతుల నమస్కారాలు ఉన్నాయి. మొదటిది కాయిక పద్ధతి. అంటే చేతులు జోడించి (సంపుటీ కరించి) నమస్కరించడం. 2. రెండవది వాచకం. నమః అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ చేసే నమస్కారం. 3. మానసికం. నమ్రతను భావ రూపేణా వ్యక్తం చేసేది మానసిక నమస్కారం.
నమస్కార పద్ధతులు[2]
సాష్టాంగ నమస్కారం అనే ఒక పద్ధతిని గురించి తరచూ వింటుంటాము. శిరస్సు, రెండు భుజాలు, వక్షస్థలం/ పొట్ట, రెండు మోకాళ్లు, రెండు పాదాల వ్రేళ్లు నేలకు ఆనేలా సాగిలపడటం. పంచ అంగ నమస్కారం అనే మరొక పద్ధతిలో శిరస్సు, రెండు చేతులు, రెండు మోకాళ్లు నేలకు ఆనించడం పంచాంగ నమస్కారం. త్య్రంగ/ మూడు అంగాల నమస్కారం అనేది మరొక పద్ధతి. రెండు చేతులు శిరస్సు విూద ఉంచి నమస్కరించడం. ఈ పద్ధతి, శిరస్సు మాత్రమే వంచడం ఏకాంగ నమస్కారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి