108 ఉపనిషత్తుల జాబితా
వేదాలు కర్మ కాండను చెపుతున్నాయి అంటే ఏయే కర్మలు చేస్తే ఏయే ఫలితాలు వస్తాయి అన్నదన్నమాట. కాగా వేదాల చివరగావున్నాయని చెప్పేవి ఉపనిషత్తులు. వేదాలకు చివరగా ఉన్నందున వేదాంతంగా పరిగణించబడింది. ఈ ఉపనిషత్తులు అనేవి జ్ఞ్యాన కాండకు చెందినవి. ఇందులో చాలావరకు మేధావులైన ఋషులు వారిశిష్యులకు మరియు ఇతరులకు ఉపదేశించినవిగా మనకు కనపడుతున్నాయి. ఉపనిషత్తులు పూర్తిగా బ్రహ్మజ్ఞానానికి సంబందించినవిగ తెలుస్తున్నాయి. ఈ సృష్టికి మూలం ఎవరు అన్న విషయాన్నీ శోధించి చివరకు మానవ జీవిత పరమ లక్ష్యము మోక్షమే అన్నది సూచించేవే ఉపన్సిషత్తులు. ఉపనిషత్తులు ఈ జగత్తు పూర్తిగా బ్రహ్మ పదార్థమే కాక వేఱొక్కటి లేదనే సత్యాన్ని తెలియచేస్తూ ఆద్వ్యత తత్వాన్ని తెలియచేస్తున్నాయి. బ్రహ్మ తప్ప వేరొకటి లేదంటే అంతా బ్రహ్మ అనగా నీవు నేను కూడా ఆ బ్రహ్మ లోని వారమే అని తెలుస్తున్నది. ఇక్కడ రెండవది అనేది లేదు. కాబట్టి డ్వేతానికి చోటులేదు. మొత్తము 1180 ఉపనిషత్తులు ఉన్నాయని అంటారు, కాగా వాటిలో ప్రముఖమైనవి 108 గా పేర్కొన్నారు. ఇక్కడ ఆ ఉపనిషత్తులను చూద్దాము.
1. ఈశావాస్య ఉపనిషత్తు(ఈశావాస్యోపనిషత్తు), 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు
మాండూక్యోపనిషత్తు
తైత్తిరీయోపనిషత్తు
ఐతరేయోపనిషత్తు
ఛాందోగ్యోపనిషత్తు
బృహదారణ్యకోపనిషత్తు
శ్వేతాశ్వతరోపనిషత్తు
కౌశీతకి ఉపనిషత్తు
మైత్రాయణి ఉపనిషత్తు
బ్రహ్మోపనిషత్తు
కైవల్యోపనిషత్తు
జాబలోపనిషత్తు
హంసోపనిషత్తు
ఆరుణికోపనిషత్తు
గర్భోపనిషత్తు
నారాయణోపనిషత్తు
పరమహంస ఉపనిషత్తు
అమృతబిందు ఉపనిషత్తు
అమృతనాదోపనిషత్తు
అథర్వశిరోపనిషత్తు
అథర్వాశిఖోపనిషత్తు
బృహజ్జాబాలోపనిషత్తు
నృసింహతాపిన్యుపనిషత్తు
కళాగ్నిరుద్రోపనిషత్తు
మైత్రేయోపనిషత్తు
సుబాలోపనిషత్తు
క్షురికోపనిషత్తు
మంత్రికోపనిషత్తు
సర్వసారోపనిషత్తు
నిరలాంబోపనిషత్తు
శుకరహాస్యోపనిషత్తు
వజ్రసూచ్యుపనిషత్తు
తేజోబిందూపనిషత్తు
నృసిందబిందూపనిషత్తు
ధ్యానబిందూపనిషత్తు
బ్రహ్మవిద్యోపనిషత్తు
యోగతత్వోపనిషత్తు
ఆత్మబోధోపనిషత్తు
నారదపరివ్రాజకోపనిషత్తు
త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు
సీతోపనిషత్తు
యోగచూడామణ్యుపనిషత్తు
నిర్వాణోపనిషత్తు
మండల బ్రాహ్మణోపనిషత్తు
దక్షిణామూర్త్యుపనిషత్తు
శరభోపనిషత్తు
స్కందోపనిషత్తు
మహానారాయణోపనిషత్తు
అద్వయతారకోపనిషత్తు
రామరహస్యోపనిషత్తు
రామతాపిన్యుపనిషత్తు
వాసుదేవోపనిషత్తు
ముద్గలోపనిషత్తు
శాండిల్యోపనిషత్తు
పైంగలోపనిషత్తు
భిక్షుకోపనిషత్తు
మహోపనిషత్తు
శారీరకోపనిషత్తు
యోగశిఖోపనిషత్తు
తురియాతీతోపనిషత్తు
సన్యాసోపనిషత్తు
పరమహంస పరివ్రాజకోపనిషత్తు
అక్షమాలికోపనిషత్తు
అవ్యక్తోపనిషత్తు
ఏకాక్షరోపనిషత్తు
అన్నపూర్ణోపనిషత్తు
సూర్యోపనిషత్తు
అక్ష్యుపనిషత్తు
అధ్యాత్మోపనిషత్తు
కుండికోపనిషత్తు
సావిత్ర్యుపనిషత్తు
ఆత్మోపనిషత్తు
పశుపతబ్రహ్మోపనిషత్తు
పరబ్రహ్మోపనిషత్తు
అవధూతోపనిషత్తు
త్రిపురతాపిన్యుపనిషత్తు
శ్రీదేవ్యుపనిషత్తు
త్రిపురోపనిషత్తు
కఠరుద్రోపనిషత్తు
భావనోపనిషత్తు
రుద్రహృదయోపనిషత్తు
యోగకుండల్యుపనిషత్తు
భస్మజాబలోపనిషత్తు
రుద్రాక్షజాబలోపనిషత్తు
గణపత్యుపనిషత్తు
దర్శనోపనిషత్తు
తారాసారోపనిషత్తు
మహావాక్యోపనిషత్తు
పంచబ్రహ్మోపనిషత్తు
ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు
గోపాలతాపిన్యుపనిషత్తు
కృష్ణోపనిషత్తు
యాజ్ఞవల్క్యోపనిషత్తు
వరాహోపనిషత్తు
శాట్యానీయోపనిషత్తు
హయగ్రీవోపనిషత్తు
దత్తాత్రేయోపనిషత్తు
గరుడోపనిషత్తు
కలిసంతారణోపనిషత్తు
బాల్యుపనిషత్తు
సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు
సరస్వతీ రహస్యోపనిషత్తు
భహ్వృచోపనిషత్తు
ముక్తికోపనిషత్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి